1. గతంలో బ్యాంకులో లోన్‌కు అప్లై చేస్తే బ్యాంకు సిబ్బంది వెరిఫికేషన్ చేసి రుణాలు మంజూరు చేయాలా వద్దా అని నిర్ణయించేవారు. ఇప్పటికీ కొన్ని లోన్స్‌కి ఈ ప్రాసెస్ ఉంది. అయితే ఇప్పుడు ఎవరైనా కస్టమర్ లోన్ కోసం దరఖాస్తు చేస్తే బ్యాంకులు మొదట చెక్ చేసేది సిబిల్ స్కోర్ (CIBIL Score). ఈ స్కోర్ చెక్ చేసిన తర్వాత అప్లికేషన్ యాక్సెప్ట్ చేయాలా వద్దా అని నిర్ణయిస్తాయి బ్యాంకులు. (ప్రతీకాత్మక చిత్రం)
2. పర్సనల్ లోన్, కార్ లోన్, టూవీలర్ లోన్, హోమ్ లోన్, క్రెడిట్ కార్డ్ (Credit Card) లాంటివాటికి అప్లై చేస్తే బ్యాంకులు ముందుగా కస్టమర్ల సిబిల్ స్కోర్ చెక్ చేసి సదరు కస్టమర్ క్రెడిట్ హిస్టరీ, గతంలో తీసుకున్న అప్పుల్ని చెల్లించిన తీరుపై ఓ అంచనాకు వస్తాయి. ఆ తర్వాత లోన్ ప్రాసెస్ ప్రారంభిస్తాయి. సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటే ముందే లోన్ రిజెక్ట్ చేస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఇండియాలో సిబిల్ స్కోర్ 2007లో అమలులోకి వచ్చింది. అప్పట్నుంచి బ్యాంకులు, ఫైనాన్సింగ్ సంస్థల్లో అప్పులు తీసుకొని చెల్లించినవారికి క్రెడిట్ స్కోర్ కేటాయిస్తోంది ట్రాన్స్‌యూనియన్ సిబిల్ సంస్థ. ఈ స్కోర్‌నే సిబిల్ స్కోర్ లేదా క్రెడిట్ స్కోర్ లేదా సిబిల్ రిపోర్ట్ అంటారు. ఆర్థిక లావాదేవీలు జరిపే ప్రతీ ఒక్కరూ తమ సిబిల్ స్కోర్ ఎంత చెక్ చేసుకోవాలి. (ప్రతీకాత్మక చిత్రం)
4. సిబిల్ స్కోర్ ఎంత ఉంటుంది? ఏ స్కోర్‌ను బ్యాంకులు పరిగణలోకి తీసుకుంటాయన్న సందేహాలు అందరిలో ఉంటాయి. సిబిల్ స్కోర్ 300 నుంచి 900 మధ్య ఉంటుంది. 750 కన్నా ఎక్కువ సిబిల్ స్కోర్ ఉంటే మంచి క్రెడిట్ స్కోర్‌గా భావిస్తారు. మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే రుణాలు మంజూరు చేసే ప్రక్రియ సులువవుతుంది. సిబిల్ రిపోర్ట్ చెక్ చేస్తే అందులో క్రెడిట్ స్కోర్ ఎంతో తెలుస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. దీంతో పాటు గతంలో ఎన్ని రుణాలు తీసుకున్నారు, వాయిదాలు ఎలా చెల్లించారు, ప్రస్తుతం ఎన్ని రుణాలు యాక్టీవ్‌లో ఉన్నాయి, ఎన్ని క్రెడిట్ కార్డులు వాడుతున్నారు అన్న వివరాలన్నీ సిబిల్ రిపోర్ట్‌లో ఉంటాయి. ఒకవేళ మీ ప్రమేయం లేకుండా ఎవరైనా రుణాలు తీసుకున్నా సిబిల్ రిపోర్ట్‌లో తెలుసుకోవచ్చు.మరి ఆన్లైన్లో మీ సిబిల్ రిపోర్ట్ ఎలా చెక్ చేయాలో తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
6. ముందుగా https://www.cibil.com/ వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఆ తర్వాత Get your CIBIL Score పైన క్లిక్ చేయండి. ఆ తర్వాత మీ వివరాలతో రిజిస్ట్రేషన్ చేయండి. మీ వివరాలతో లాగిన్ అయిన తర్వాత go to dashboard పైన క్లిక్ చేయండి. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో మీ క్రెడిట్ స్కోర్ కనిపిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)