Hero Electric Dash: ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ హీరో నుంచి వచ్చిన హీరో డాష్ (Hero Electric Dash) దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.62 వేలుగా నిర్ణయించారు. అయితే దీంతో పాటు హీరో నుంచి మరో రెండు స్కూటర్లు కూడా మార్కెట్లో అందుబాటులో ఉంచారు. అవి Hero Optima ER ధర రూ. 68,721 (ఎక్స్-షోరూమ్), Hero Nyx ER ధర రూ. 69,754 (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. Hero Electric Dash విషయానికి వస్తే ఇందులో 48V సామర్థ్యంతో 28 Ah Li-Ion బ్యాటరీని అందిస్తారు.ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒకసారి పూర్తిగా ఛార్జ్ కావడానికి నాలుగు గంటల సమయం పడుతుంది. పూర్తి ఛార్జింగ్ తో 60 కి.మీ దూరం ప్రయాణించవచ్చు.
Bounce Infinity E1: గతంలో టాక్సీ సేవలను అందించి మార్కెట్లో సందడి చేసిన బౌన్స్ ఈ సారి మాత్రం ఎలక్ట్రిక్ వాహనంతో మార్కెట్లోకి ప్రవేశించింది. Bounce Infinity E1 పేరుతో ఎలక్ట్రిక్ స్కూటర్ ను ప్రవేశపెట్టింది. ఢిల్లీలో బ్యాటరీ లేకుండా ఈ స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధర రూ.45,099 గా నిర్ణయించారు. అయితే బ్యాటరీ, చార్జర్ తో కలిపి ధర రూ. 68,999 (ఢిల్లీ ఎక్స్-షోరూమ్ ధర)గా నిర్ణయించారు.
Avon E Scoot: ప్రముఖ సైకిల్ కంపెనీ అయిన ఏవన్ కంపెనీ నుంచి వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధరను 45 వేల రూపాయలుగా నిర్ణయించారు. ఒక సారి చార్జ్ చేస్తే 65 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ ఇస్తుంది. ఇదే కంపెనీ నుంచి వచ్చిన Avon E Lite కేవలం రూ. 28,000కే అందుబాటులో ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 50 కి.మీ వరకు ఉంటుంది.