1. ఇండియాలో ఎలక్ట్రిక్ కార్ల హవా నడుస్తోంది. ఈ డిమాండ్‌కు తగ్గట్లు అన్ని ఆటోమొబైల్ కంపెనీలు సరికొత్త ఎలక్ట్రిక్ కార్లు తీసుకొస్తున్నాయి. తాజాగా ముంబై బేస్డ్ PMV ఎలక్ట్రిక్ కంపెనీ ఈ రోజు (నవంబర్ 16న) అతి తక్కువ ధరతో మైక్రో-ఎలక్ట్రిక్ కారు Eas-E (ఈజ్)ను లాంచ్ చేసింది. ఇండియాలో ఇప్పటివరకు లాంచ్ అయిన అన్ని ఎలక్ట్రిక్ కార్లలో ఇదే అత్యంత చిన్నది. (image: PMV Electric)
3. PMV ఎలక్ట్రిక్ కంపెనీ నుంచి రిలీజ్ అయిన తొలి ఎలక్ట్రిక్ కారు Eas-E బేస్ వేరియంట్ మొదటి 10 వేల కస్టమర్లకు రూ.4.79 లక్షల ఇంట్రడక్టరీ ప్రైస్‌కి లభిస్తుంది. ఇదే కారు హై-ఎండ్ బ్యాటరీ ప్యాక్ వెర్షన్లు వరుసగా రూ.6.79 లక్షలు, రూ.7.79 లక్షలుగా ఉన్నాయి. బుకింగ్స్ కొద్దిరోజుల క్రితమే ఓపెన్ చేయగా ఇప్పటికే తమ Eas-E కారు కోసం 6,000 ప్రీ-ఆర్డర్ నమోదయినట్లు కంపెనీ ప్రకటించింది. (image: PMV Electric)
4. Eas-E ఈవీ 2-ప్యాసింజర్ సీటింగ్ కెపాసిటీతో వస్తుంది. ఇందులో ఇద్దరు పెద్దవాళ్లు, చిన్న వయసున్న ఒక బాలిక లేదా బాలుడు కూర్చోవచ్చు. ఇది మొత్తం 36 చదరపు అడుగుల విస్తీర్ణంతో వస్తుంది. దీని పొడవు 2,915 మిమీ, వెడల్పు 1,157 మిమీ.. ఎత్తు 1,600 మిమీ. వీల్‌బేస్ 2,087 మిమీ పొడవు ఉంటుంది. దీని గ్రౌండ్ క్లియరెన్స్ 170 మిమీ. కర్బ్ వెయిట్ దాదాపు 550కేజీలు ఉంటుంది. ఇలా చాలా తక్కువ పరిమాణంలో వస్తున్న ఈ కారు సిటీ ట్రాఫిక్‌లోనూ బైక్ వలె ఈజీగా దూసుకెళ్తుంది. (image: PMV Electric)
5. Eas-E కారులో రిమోట్ పార్క్ అసిస్ట్, రిమోట్ హార్న్, ఫాలో-మీ-హోమ్ లైట్లు, రీజెనరేటివ్ బ్రేకింగ్ వంటి అనేక స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి. ఈ కారుకు ఓవర్-ది-ఎయిర్ అప్డేట్లను కంపెనీ ఆఫర్ చేయనుంది. ఏసీ, లైట్లు, విండోస్, హారన్లను రిమోట్‌గా కంట్రోల్ చేయడానికి మొబైల్ అప్లికేషన్ వంటి ఫీచర్లతో ఇది వస్తుంది. (image: PMV Electric)
6. క్రూయిజ్ కంట్రోల్, ఎలక్ట్రికల్లీ అడ్జస్ట్బుల్ ఔట్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్స్ వంటి అడ్వాన్స్డ్ ఫీచర్లు కూడా ఇందులో అందించడం విశేషం. Eas-E కనెక్ట్ యాప్‌తో టైట్ పార్కింగ్ స్పాట్స్‌లో ఈవీని రిమోట్‌గా పార్క్ చేసుకోవచ్చు. స్టీరింగ్ వీల్‌లోని థంబ్‌నెయిల్ కంట్రోల్స్ ద్వారా కారును ఆపరేట్ చేసేలా ఇందులో ఫీట్ ఫ్రీ మోడ్‌ను అందించారు. ఇందులో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్.. స్మాల్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, మోనోకోక్ ఛాసిస్, హై స్ట్రెంగ్త్ షీట్ మెటల్ బిల్డ్, ముందు భాగంలో ఒక డ్రైవర్-ఎయిర్‌బ్యాగ్ ఇచ్చారు. (image: PMV Electric)
7. Eas-E మైక్రో-కారు 10 kW శక్తిని.. 50 Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే PMSM మోటార్‌తో వస్తుంది. ఈ మోటార్‌తో కారు గరిష్ఠంగా 70 kmph వరకు వేగాన్ని అందుకుంటుంది. ఈ ఎలక్ట్రిక్ మూడు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్‌తో వస్తుంది. బేస్ వేరియంట్ 120km రేంజ్ అందిస్తే మిగతావి 160km, 200 km రేంజ్ ఆఫర్ చేస్తాయి. ఈ మూడు వేరియంట్లను ఫుల్‌గా ఛార్జ్ చేయడానికి 3 నుంచి 4 గంటల మధ్య సమయం పడుతుంది. ఈ EV కి.మీకి 75 పైసల కంటే తక్కువ రన్నింగ్ కాస్ట్ ఉంటుందని కంపెనీ పేర్కొంది. IP67 వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్‌తో కారు బ్యాటరీలు వస్తాయి. (image: PMV Electric)