ఇంకా మారుతీ సుజుకీ కంపెనీకి చెందిన సెలెరియో కారు కూడా అందుబాటు ధరలోనే ఉంది. ఇందులో 1 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. స్టార్ట్, స్టాప్ సిస్టమ్ ఫీచర్ ఉంది. మ్యానువల్, ఏఎంటీ వేరియంట్ల రూపంలో ఈ కారు లభిస్తోంది. ఈ కారులో 12 సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. ఎక్స్‌షోరూమ్ ధర రూ. 5.25 లక్షల నుంచి ప్రారంభం అవుతోంది. సీఎన్జీ మోడల్ 35 కిలోమీటర్లకు పైగా మైలేజ్ అందిస్తుంది.
అలాగే మారుతీ సుజుకీ ఎస్ ప్రెసో కారు కూడా ఉంది. ఇందులో 998 సీసీ ఇంజిన్ ఉంటుంది. సీఎన్జీ మోడల్ కూడా ఉంది. ఇందులో మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్, టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, డ్యూయెల్ ఎయిర్ బ్యాగ్స్, పవర్ స్టీరింగ్, ఏసీ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ కారు ఎక్స్‌షోరూమ్ ధర రూ. 4.25 లక్షల నుంచి ఉంది.