ఈ ఏడాది జనవరిలో ప్రభుత్వం ఉద్యోగుల కరువు భత్యాన్ని 31 శాతం నుంచి 34 శాతానికి పెంచింది. డీఏ పెంపుతో దాదాపు 50 లక్షల మంది ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. న్యూస్18 నివేదిక ప్రకారం, ఈసారి ప్రభుత్వం నాలుగు శాతం డీఏ పెంచవచ్చని భావిస్తున్నారు. ఏప్రిల్, మే, జూన్లలో AICPI 126 కంటే ఎక్కువగా ఉంటే..ప్రభుత్వం DA 4 శాతం పెంచవచ్చు.(ప్రతీకాత్మక చిత్రం)
ఏఐసీపీఐ జనవరిలో 125.1, ఫిబ్రవరిలో 125గా ఉంది. ఇదే సమయంలో మార్చిలో పెరిగి వినియోగదారుల ధరల సూచీ 126కు చేరగా.. అఖిల భారత వినియోగదారుల ధరల సూచీ పెరిగిన తర్వాత డీఏలో 4 శాతం పెరిగే అవకాశం పెరిగింది. ప్రస్తుతం ఉద్యోగికి 34 శాతం డీఏ లభిస్తోంది. 4 శాతం పెరిగితే అది 38 శాతానికి పెరుగుతుంది. కేంద్ర ఉద్యోగులకు డీఏ, పెన్షనర్లకు డీఆర్ ఇస్తారు.(ప్రతీకాత్మక చిత్రం)
రూ. 56,900 ప్రాథమిక వేతనం ఉన్న ఉద్యోగులు, డియర్నెస్ అలవెన్స్ 38 శాతం ఉంటే వారికి రూ.21,622 డీఏ లభిస్తుంది. ప్రస్తుతం 34 శాతం చొప్పున రూ.19,346 డీఏ పొందుతున్నారు. డీఏ 4 శాతం పెంపుతో జీతం రూ.2,276 పెరుగుతుంది. అంటే ఏటా దాదాపు రూ.27,312 పెరగనుంది. ప్రభుత్వ డీఏ పెంపుతో దాదాపు 50 లక్షల మంది ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)