పాన్-ఆధార్ లింకింగ్ గడువును కేంద్రం మరోసారి పొడిగించింది. గతంలో ఇందుకోసం జూన్ 30వరకు గడువు విధించారు. (ప్రతీకాత్మక చిత్రం ) అయితే కరోనా సెకండ్ వేవ్ విజృంభణ నేపథ్యంలో గడువును మూడు నెలలు సెప్టెంబర్ 30 వరకు పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది. మొదట పాన్-ఆధార్ లింకు గడువును మార్చి 31గా నిర్ణయించారు.(ప్రతీకాత్మక చిత్రం ) అయితే ఆ తరువాత గడువును జూన్ 30 వరకు పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది.(ప్రతీకాత్మక చిత్రం ) ఇప్పుడు తాజాగా మరోసారి మూడు నెలల పాటు పొడగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.(ప్రతీకాత్మక చిత్రం ) ఈ ఏడాది ప్రవేశ పెట్టిన ఆర్ధిక బిల్లులో ప్రభుత్వం ఒక సవరణను కూడా చేసింది.(ప్రతీకాత్మక చిత్రం ) కొత్త నిబంధన ప్రకారం ఒక వ్యక్తి పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయకపోతే రూ.1000 వరకు ఆలస్యం రుసుము కింద ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.(ప్రతీకాత్మక చిత్రం )