2. అదే విధంగా నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో ఇష్యూ ధర కంటే 95.6 శాతం ఎక్కువగా రూ.626 వద్ద స్టాక్ లిస్ట్ అయింది. డిసెంబర్ 14న IRCTC, BSEలో రూ.734.70 ప్రైస్ వద్ద ఎండ్ అయింది. అయితే ప్రస్తుతం IRCTCలో ప్రభుత్వం 5 శాతం వరకు వాటాలను ఆఫర్ ఫర్ సేల్(OFS) ద్వారా విక్రయించనుంది. 14న BSEలో షేర్ ఎండ్ అయిన ప్రైస్ కంటే 7.4 శాతం తక్కువగా.. OFS ఫ్లోర్ ధరను ఒక్కో షేరుకు రూ.680గా నిర్ణయించింది. (ప్రతీకాత్మక చిత్రం)
3. భారత ప్రభుత్వం 5 శాతం వాటాను విక్రయించడం ద్వారా రూ.2,720 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఆఫర్ ఫర్ సేల్ మార్గంలో ప్రమోటర్( భారత ప్రభుత్వం) 2.5 శాతం వాటాను విక్రయించాలని భావిస్తోంది, అదనంగా 2.5 శాతం విక్రయించే అవకాశం ఉంది. మొత్తంగా ఇష్యూలో 4 కోట్ల షేర్లు లేదా 5 శాతం వాటా చేతులు మారే అవకాశం ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. IRCTC కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపిన వివరాల మేరకు.. ప్రమోటర్ IRCTC నుంచి 2,00,00,000 ఈక్విటీ షేర్లను విక్రయించాలని ప్రపోజ్ చేసినట్లు పేర్కొంది. మొత్తం జారీ చేసిన, చెల్లించిన ఈక్విటీ షేర్ క్యాపిటల్‌లో ఈఈ షేర్లు 2.5 శాతమని తెలిపింది. అదనంగా 2,00,00,000 షేర్లను విక్రయించే అవకాశం ఉందని, ఈ మొత్తం కూడా 2.5 శాతంగా ఉంటుందని పేర్కొంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. నాన్-రిటైల్ ఇన్వెస్టర్లు డిసెంబర్ 15న ఆఫర్ ఫర్ సేల్‌కి సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చు. అయితే తమ అన్ అలాటెడ్ బిడ్స్‌ని క్యారీ ఫార్వార్డ్ చేయాలనుకుంటున్న రిటైల్ ఇన్వెస్టర్లు డిసెంబరు 16న సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చు. T రోజున తమ బిడ్లను ఉంచిన రిటైల్ ఇన్వెస్టర్లు తమ అన్ అలాటెడ్ బిడ్లను T+1 రోజుకి ఫార్వార్డ్ చేయవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
6. 2022 డిసెంబర్ 15(T డే) (నాన్ రిటైల్ ఇన్వెస్టర్స్‌కి మాత్రమే), 2022 డిసెంబర్ 16న (T+1 డే) (అన్ అలాటెడ్ బిడ్లను క్యారీ ఫార్వార్డ్ చేయాలని నిర్ణయించుకున్న రిటైల్ ఇన్వెస్టర్లు, నాన్ రిటైల్ ఇన్వెస్టర్లకు) అని IRCTC ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. విక్రేత తరఫున ఆఫర్ ఫర్ సేల్ కోసం బ్రోకర్లు యాక్సిస్ క్యాపిటల్, సిటిగ్రూప్ గ్లోబల్ మార్కెట్స్, Goldman Sachs, JM ఫైనాన్షియల్ వ్యవహరిస్తున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
7. 2022 సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో IRCTC నెట్ ప్రాఫిట్ 42 శాతం పెరిగి రూ.226 కోట్లకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ.405 కోట్ల నుంచి సెప్టెంబర్ త్రైమాసికానికి ఆపరేషన్స్‌పై రెవెన్యూ 99 శాతం పెరిగి రూ.806 కోట్లకు చేరుకుంది. ఆర్థిక సంవత్సరం 2022 రెండో త్రైమాసికంలో రూ.405 కోట్లుగా ఉన్న టోటల్ ఇన్‌కం.. ఆర్థిక సంవత్సరం 2023 రెండో త్రైమాసికానికి 105 శాతం పెరిగి రూ.832 కోట్లకు చేరుకుంది. (ప్రతీకాత్మక చిత్రం)