గ్యాస్ సిలిండర్ బరువు కారణంగా సాధారణంగా అందరం ఇబ్బంది పడుతూ ఉంటాం. దాన్ని ఎటు నుంచి ఎటు జరపాలన్నా.. అవస్థే ఉంటుంది. ముఖ్యంగా ఈ విషయంలో వృద్ధులు, మహిళలు అయితే మరొకరి సహాయం తీసుకోవాల్సిన పరిస్థితి. ఈ ఇబ్బందులను పరిగణలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం త్వరలో గృహ వినియోగానికి ఉపయోగించే ఎల్పీజీ సిలిండర్ బరువును త్వరలో తగ్గించాలని సూచనప్రాయంగా వెల్లడించింది.(ప్రతీకాత్మక చిత్రం)
ప్రస్తుతం 14.2 కిలోల బరువున్న సిలిండర్లను ఇళ్లకు అందజేస్తున్నారు. అయితే ఇంత మొత్తంలో బరువు ఉన్న సిలిండర్లతో ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా మహిళలు వాటిని ఒక చోట నుంచి మరో చోటికి తీసుకెళ్లేందుకు ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని ఓ సభ్యుడు రాజ్యసభలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. 14.2 కేజీలు ఉన్న సిలిండర్లను డెలివరీ చేయడం కూడా కష్టమవుతుందని వివరించారు.(ప్రతీకాత్మక చిత్రం)
14.2 కేజీల బరువున్న డొమెస్టిక్ సిలిండర్ ను 5 కేజీలకు తగ్గించడం లేదా ఇతర ఆప్షన్లను పరిశీలిస్తున్నట్లు కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ రాజ్యసభలో వెల్లడించారు. ప్రస్తుతం 14.2 కేజీలు ఉండడంతో సిలిండర్ ను మోయడం, ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లడం ఇబ్బంది అవుతోందన్నారు. ఈ సమస్యకు త్వరలో పరిష్కారం చూపుతామని ఆయన వివరించారు.(ప్రతీకాత్మక చిత్రం)
ఇదిలా ఉంటే గ్యాస్ సిలిండర్ పై సబ్సీడీని భారీగా పెంచాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. రూ.300కంటే ఎక్కువ మొత్తంలో సబ్సిడీని లబ్ధిదారుల అకౌంట్లలో జమ చేస్తుందన్న ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. కేంద్రం నిజంగా ఇలాంటి నిర్ణయం తీసుకుంటే.. గ్యాస్ సిలిండర్ను రూ.700 లోపే పొందే అవకాశం ఉంటుంది. ఇంకా రూ.10,00,000 వార్షికాదాయం కంటే ఎక్కువ ఉన్న వారికి సబ్సిడీని తొలగించాలన్న ప్రతిపాదనల్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.(ప్రతీకాత్మక చిత్రం)
ఇదిలా ఉంటే.. వ్యాపార అవసరాల కోసం కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను ఆయిల్ కంపెనీలు ఇటీవల ఏకంగా రూ.103.50కు పెంచాయి ఆయిల్ కంపెనీలు. దీంతో హైదరాబాద్ మార్కెట్లో కమర్షియల్ సిలిండర్ ధర రూ.2278 కి చేరుకుంది. ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర 2000.50 నుంచి రూ.2,104 ధరకు చేరుకుంది. కోల్కతాలో ప్రస్తుతం ఈ సిలిండర్ ధర రూ.2,174.50, ముంబైలో రూ.2,051, చెన్నైలో రూ.2,234.50.(ప్రతీకాత్మక చిత్రం)
డొమెస్టిక్ సిలిండర్ల ధరను మాత్రం పెంచలేదు. డొమెస్టిక్ సిలిండర్ ధర చివరిసారిగా అక్టోబర్ 6న పెరిగింది. ఆ తర్వాత నవంబర్లో డొమెస్టిక్ సిలిండర్ ధరను మళ్లీ పెంచకపోవడం సామన్యులకు కాస్త ఊరట కలిగించింది. డిసెంబర్ 1న కూడా ధరల్ని యథాతథంగా ఉంచాయి. హైదరాబాద్లో ప్రస్తుతం డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.952గా ఉంది.(ప్రతీకాత్మక చిత్రం)