1. నేషనల్ మానెటైజేషన్ పైప్‌లైన్‌లో (National Monetization Pipeline) భాగంగా 2022 నుంచి 2025 మధ్య దేశంలోని వేర్వేరు నగరాల్లో ఉన్న 25 విమానాశ్రయాలను ప్రైవేటీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ (VK Singh) లోక్‌సభకు తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
2. నాగపూర్, వారణాసి, డెహ్రడూన్, తిరుచ్చి, ఇండోర్, చెన్నై, కాలికట్, కొయంబత్తూర్, భువనేశ్వర్, పాట్నా సహా 25 విమానాశ్రయాల ఆస్తుల్ని ప్రైవేటీకరిస్తామని వీకే సింగ్ తెలిపారు. వీటితో పాటు తిరుపతి, రాజమండ్రి, విజయవాడ, మదురై, రాంచీ, జోధ్‌పూర్, రాయ్‌పూర్, వడోదర, అమృత్సర్, సూరత్, హుబ్లీ, ఇంఫాల్, అగర్తలా, ఉదయ్‌పూర్, భోపాల్ విమానాశ్రయాలను కూడా కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరించనుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3. ప్రైవేటీకరించాలనుకున్న ఎయిర్‌పోర్టుల జాబితా రూపొందించేందుకు వార్షిక రద్దీని పరిగణలోకి తీసుకున్నట్టు మంత్రి వీకే సింగ్ తెలిపారు. వార్షికంగా 0.4 మిలియన్ కన్నా ఎక్కువ ప్రయాణికుల రద్దీ ఉన్న ఎయిర్‌పోర్టుల్ని ప్రైవేటీకరిస్తున్నామన్నారు. మొదట టైర్ 2, టైర్ 3 నగరాల్లో ఉన్న అమృత్సర్, వారణాసి, భువనేశ్వర్, ఇండోర్, రాయ్‌పూర్, తిరుచ్చి విమానాశ్రయాలను ప్రైవేటైజ్ చేయాలని ఏఏఐ గుర్తించినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. (ప్రతీకాత్మక చిత్రం)
4. 2022-23 ఆర్థిక సంవత్సరంలో కాలికట్, కొయంబత్తూర్, నాగ్‌పూర్, పాట్నా, మదురై, సూరత్, రాంచీ, జోధ్‌పూర్ విమానాశ్రయాలను ప్రైవేటీకరించనుంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి, విజయవాడ ఎయిర్‌పోర్టులతో పాటు చెన్నై, విజయవాడ, వడోదర, భోపాల్, హుబ్లీ విమానాశ్రయాలను ప్రైవేటీకరించనుంది. ఆ తర్వాత రాజమండ్రితో పాటు ఇంఫాల్, అగర్తలా, డెహ్రడూన్ ఎయిర్‌పోర్టులు ప్రైవేటుపరం కానున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
5. విదేశీ విమానాశ్రయాల గణనీయమైన భాగస్వామ్యం ఉంటుందనే అంచనాతో తదుపరి ఆస్తుల ప్రైవేటీకరణలో 20 నుంచి 25 విమానాశ్రయాలను ప్రభుత్వం ప్రైవేటీకరించనుందని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఛైర్మన్ గురుప్రసాద్ మోహపాత్ర 2019 లో ప్రకటించిన సంగతి తెలిసిందే. మరో నాలుగేళ్లలో 25 విమానాశ్రయాల ఆస్తుల్ని అమ్మడం ద్వారా రూ.20,782 కోట్లు సేకరించనున్నట్టు 2021 ప్రారంభంలోనే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. (ప్రతీకాత్మక చిత్రం)
6. 2020-21 కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశంలోని 136 విమానాశ్రయాల్లో 133 విమానాశ్రయాలు భారీ నష్టాలను చవిచూశాయని వీకే సింగ్ తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం) అన్ని విమానాశ్రయాల్లో కలిపి 2018-19 లో రూ.465.91 కోట్ల నష్టాలు, 2019-20 లో రూ.80.18 కోట్ల నష్టాలు ఉంటే 2020-21 లో రూ.2,882.74 కోట్ల నష్టాలను పోస్ట్ చేశాయి. (ప్రతీకాత్మక చిత్రం)
7. 2020-21 లో కందాల, కాన్పూర్ చకేరీ, బరేలీ, పోర్బందర్ విమానాశ్రయాలు తప్ప మిగతా అన్ని విమానాశ్రయాలు నష్టాలను పోస్ట్ చేశాయి. ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నష్టాలు రూ.384.81 కోట్లు. విమానాశ్రయంలో ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాటా 26 శాతం కాగా, అదానీ ఎయిర్పోర్ట్ హోల్డింగ్స్ వాటా 74 శాతం. ఇక న్యూ ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నష్టాలు రూ.317.41 కోట్లు. (ప్రతీకాత్మక చిత్రం)