ప్రస్తుతం ఈ యాప్ ఇంగ్లీష్, హిందీ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. రానున్న కాలంలో తెలుగు సహా ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా అందుబాటులోకి రానుంది. జీవనోపాధి కోసం కొత్త ప్రాంతాలకు వెళ్ళే రేషన్ కార్డ్ హోల్డర్లకు మేరా రేషన్ మొబైల్ యాప్ ప్రయోజనం చేకూరుస్తుందని ఆహార, ప్రజా పంపిణీ శాఖ అధికారులు తెలిపారు. (image : play store)
దీనిలో రేషన్ కార్డు సాయంతో రిజిస్టర్ చేసుకోవాలి. అయితే కొన్ని రేషన్ కార్డుల నెంబర్లు ఎంటర్ చేసినప్పుడు.. ఎలాంటి వివరాలను తెలియజేయడం లేదనే విమర్శ మాత్రం ఉంది. కరోనా మహమ్మారి కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు సహాయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలతో పాటుగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఉచిత రేషన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. (ప్రతీకాత్మక చిత్రం)