1. కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ఓటర్ ఐడీ, ఆధార్ లింకింగ్ కోసం రూల్స్ ప్రకటిస్తుందని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుశీల్ చంద్ర తెలిపారు. ఓటర్లు ఆధార్ వివరాలను వెల్లడించడం స్వచ్ఛందమే. తమ ఆధార్ వివరాలు వెల్లడించకూడదని ఓటర్లు అనుకుంటే వారు నిరాకరించే అవకాశం ఉంటుంది. అయితే అందుకు గల కారణాలను వివరించాల్సి ఉంటుందని సీఈసీ సుశీల్ చంద్ర అన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
4. గతంలో కొత్తగా ఓటరుగా నమోదు చేయడానికి జనవరి 1 కటాఫ్ తేదీగా ఉండేది. జనవరి 2న పుట్టినవారు ఓటరుగా నమోదు చేయడానికి ఏడాది ఆగాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు నాలుగు తేదీలు అందుబాటులో ఉన్నాయి. 18 ఏళ్లు దాటినవారంతా ముందుగానే ఓటరుగా నమోదు చేయడానికి ఈ సంస్కరణ ఉపయోగపడుతోంది. 20 ఏళ్లుగా ఈ సంస్కరణ పెండింగ్లో ఉందని సుశీల్ చంద్ర తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఇక ఓటర్ ఐడీకి ఆధార్ లింకింగ్ విషయానికి వస్తే నకిలీ ఓటర్లను తొలగించడానికి ఈ సంస్కరణ ఉపయోగపడనుంది. ఇందుకు సంబంధించిన ముసాయిదా ప్రతిపాదనలను పంపామని, మార్చవలసిన ఫామ్స్ వివరాలు కూడా పంపామని, న్యాయ మంత్రిత్వ శాఖ దగ్గర ఉన్నాయని, ఆ ఫైల్స్ త్వరలోనే క్లియర్ అవుతాయని ఆశిస్తున్నట్టు తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఓటర్లు అందరూ తమ ఆధార్ నెంబర్ను ఓటర్ ఐడీకి లింక్ చేయొచ్చు. అయితే స్వచ్ఛందంగానే ఈ రెండు డాక్యుమెంట్స్ లింక్ చేయొచ్చు. ఓటర్ ఐడీకి ఆధార్ నెంబర్ లింక్ చేయడం ఇష్టం లేనివారు సరైన కారణం వెల్లడించాల్సి ఉంటుంది. ఆధార్ లేనివారు మాత్రమే లింక్ చేయలేకపోవచ్చని, అంతకు మించిన కారణం ఉండకపోవచ్చని సీఈసీ అన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)