1. కేంద్ర ప్రభుత్వం ఏడాది క్రితమే కొత్త లేబర్ కోడ్స్ రూపొందించిన సంగతి తెలిసిందే. కానీ వాటి అమలులో జాప్యం జరుగుతోంది. 2022 జూలై 1 నుంచి కొత్త లేబర్ చట్టాలు (New Labour Laws) అమలు చేయొచ్చన్న వార్తలు వస్తున్నాయి. కొత్త లేబర్ కోడ్స్ అమలులోకి వస్తే ఉద్యోగుల ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్, పనివేళలు, టేక్ హోమ్ సాలరీ లాంటి అంశాల్లో భారీ మార్పులు రానున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2. కేంద్ర ప్రభుత్వం నాలుగు కొత్త లేబర్ కోడ్స్ రూపొందించింది. అందులో ఉద్యోగుల వేతనం నుంచి పీఎఫ్ కంట్రిబ్యూషన్ వరకు అనేక మార్పులు ఉన్నాయి. కొత్త లేబర్ కోడ్స్‌ని వీలైనంత త్వరగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇంకా అధికారిక సమాచారం లేకపోయినా జూలై నుంచే కొత్త లేబర్ చట్టాలు అమలులోకి రావచ్చని అంచనా. (ప్రతీకాత్మక చిత్రం)
3. కొత్త లేబర్ చట్టాల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది 4 డే వర్క్ వీక్ గురించి. అంటే వారానికి నాలుగు రోజులు మాత్రమే పనిచేసి మూడు రోజులు సెలవు తీసుకోవచ్చు. ఇందుకోసం పనిగంటల్ని పరిగణలోకి తీసుకుంటారు. కంపెనీలు, సంస్థలు ఉద్యోగులతో వారానికి 50 గంటలు పనిచేయించాలని కొత్త లేబర్ కోడ్ సూచిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. కంపెనీలు వారానికి 6 రోజులు లేదా వారానికి 5 రోజులు లేదా వారానికి 4 రోజులు పనిచేయించొచ్చు. ఎన్ని రోజులైనా పనిగంటలు మాత్రం 50 గంటలు మించకూడదు. కంపెనీ వారానికి 4 రోజులు పనిచేయించాలనుకుంటే ఉద్యోగులతో రోజుకు 12 గంటలు మాత్రమే పనిచేయించవచ్చు. వారానికి 5 రోజులు పనిచేయించాలనుకుంటే ఉద్యోగులతో రోజుకు 10 గంటలు మాత్రమే పనిచేయించవచ్చు. ఇక వారానికి 6 రోజులు పనిచేయించాలనుకుంటే ఉద్యోగులతో రోజుకు 8 గంటలు మాత్రమే పనిచేయించాలి. (ప్రతీకాత్మక చిత్రం)
5. అయితే కంపెనీలు తమ అవసరాలను బట్టి వారానికి 4 లేదా 5 లేదా 6 రోజుల పనిదినాలు ఎంచుకోవచ్చు. అది సంస్థ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ కంపెనీ వారానికి 4 రోజుల పనిదినాలు ఎంచుకుంటే ఉద్యోగులకు వారానికి మూడు రోజులు సెలవు వస్తుంది. కానీ రోజూ 12 గంటలు పనిచేయాల్సి ఉంటుంది. ఇక కొత్త చట్టాల ప్రకారం అన్ని రంగాల్లో ఒక త్రైమాసికంలో ఫ్యాక్టరీస్ యాక్ట్ కింద ఓవర్ టైమ్ 50 గంటల నుంచి 125 గంటలకు పెరుగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఇక కొత్త చట్టాల ప్రకారం గ్రాస్ సాలరీలో బేసిక్ సాలరీ 50 శాతం ఉండాలి. ఉద్యోగులు, యాజమాన్యం పీఎఫ్ కంట్రిబ్యూషన్ కూడా పెరుగుతుంది. దీంతో ప్రైవేట్ ఉద్యోగుల టేక్ హోమ్ సాలరీ తగ్గుతుంది. కొత్త కార్మిక చట్టాల ప్రకారం కేంద్ర ప్రభుత్వం కూడా ఒక ఉద్యోగి కంపెనీలో పొందగలిగే సెలవులను హేతుబద్ధం చేయాలని కోరుతోంది. ఈ సంవత్సరం మిగిలిన సెలవుల్ని తర్వాతి సంవత్సరానికి ఫార్వర్డ్ చేయడం, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ చేయడంలో కూడా మార్పులు ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)