1. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. రాబోయే ఐదు రోజుల్లో ఎప్పుడైనా ఈ ప్రకటన రావొచ్చన్నది ఆ వార్తల సారాంశం. చమరు ధరల్ని 40 పైసలు తగ్గించబోతున్నాయి ఆఆయిల్ కంపెనీలు. దశల వారీగా పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు సుమారు రూ.2 తగ్గవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
2. నవంబర్ 1న మంగళవారం నాడు పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఇండియన్ ఆయిల్, హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలను సవరించలేదు. ఇవాళ పెట్రోల్ డీజిల్ ధరలు చూస్తే హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.67 కాగా, లీటర్ డీజిల్ ధర రూ.97.82. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఇక ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72 కాగా, లీటర్ డీజిల్ ధర రూ.89.62. ఇక చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.63 కాగా, లీటర్ డీజిల్ ధర రూ.94.24. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.31 కాగా, లీటర్ డీజిల్ ధర రూ.97.28. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.101.94 కాగా, లీటర్ డీజిల్ ధర రూ.87.89. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఇప్పుడే కాదు... దాదాపు ఐదు నెలలుగా పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఏడాది మేలో లీటర్ పెట్రోల్‌పై రూ.8, లీటర్ డీజిల్‌పై రూ.6 ఎక్సైజ్ డ్యూటీ తగ్గించిన సంగతి తెలిసిందే. అప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. అప్పటి నుంచి వీటి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. (ప్రతీకాత్మక చిత్రం)
5. కేంద్ర ప్రభుత్వం మరోసారి పెట్రోల్, డీజిల్ ధరల్ని తగ్గిస్తే సామాన్యులకు పెద్ద ఊరట లభించినట్టే. ఇప్పటికే ద్రవ్యోల్బణం కారణంగా ఆహార పదార్థాల నుంచి అనేక వస్తువుల ధరలు పెరిగాయి. దీంతో సామాన్యులకు పెరిగిన ఖర్చులతో ఇంటి బడ్జెట్ కూడా పెరిగింది. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గితే కాస్త ఊరట లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)