1. పెన్షనర్లకు గుడ్ న్యూస్. 1960 నవంబర్ 18 నుంచి 1985 డిసెంబర్ 31 మధ్య సర్వీస్ నుంచి రిటైర్ అయిన సీపీఎఫ్ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. వారి డియర్నెస్ రిలీఫ్ (DR)ని 312% నుంచి 356% కి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెరిగిన డీఆర్ 2021 జూలై 1 నుంచి వర్తిస్తుందని పెన్షన్, పెన్షనర్ల సంక్షేమ శాఖ (DoPPW) తాజాగా విడుదల చేసిన ఆఫీస్ మెమోరాండంలో పేర్కొంది. (ప్రతీకాత్మక చిత్రం)
3. అయితే సీపీఎఫ్ ఉద్యోగులకు మాత్రం మూడు బకాయిలను ఇంకా చెల్లించలేదు. ఈ డీఏ బకాయిలను 5వ సీపీసీ ఎక్స్గ్రేషియా చెల్లింపుతో పాటే చెల్లిస్తామని కేంద్రం ప్రకటించింది. 1960 నవంబర్ 18 నుంచి 1985 డిసెంబర్ 31 మధ్య సర్వీస్ నుంచి రిటైర్ అయిన సీపీఎస్ లబ్ధిదారులు ప్రాథమిక ఎక్స్-గ్రేషియాకు అర్హులు. (ప్రతీకాత్మక చిత్రం)