Cable TV: గుడ్ న్యూస్... కేబుల్ టీవీ రూల్స్‌పై కేంద్రం కీలక నిర్ణయం
Cable TV: గుడ్ న్యూస్... కేబుల్ టీవీ రూల్స్‌పై కేంద్రం కీలక నిర్ణయం
Cable TV Rules | కేబుల్ టీవీ కనెక్షన్ తీసుకున్నవారికి శుభవార్త. కేంద్ర ప్రభుత్వం కేబుల్ టెలివిజన్ నెట్వర్క్ రూల్స్‌లో సవరణలు చేసింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త రూల్స్ సామాన్యులకు ఎలా ఉపయోగపడతాయో తెలుసుకోండి.
1. కేబుల్ టెలివిజన్ నెట్వర్క్ రూల్స్, 1994 లో సవరణలు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఫిర్యాదులను పరిష్కరించడానికి చట్టబద్ధమైన వ్యవస్థను ఏర్పాటు చేయనుంది కేంద్ర ప్రభుత్వం. అంటే టీవీ ఛానెళ్లలో వచ్చే కంటెంట్‌పై పౌరుల నుంచి వచ్చే ఫిర్యాదులను పరిష్కరించేందుకు ఏర్పాటయ్యే వ్యవస్థ ఇది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 6
2. కేబుల్ టీవీ నెట్వర్క్ యాక్ట్, 1995 లోని నిబంధనలకు అనుగుణంగా టీవీ ఛానెళ్లు ప్రసారాలను చేయాల్సి ఉంటుంది. ఆ ప్రసారాల్లో ఏవైనా అభ్యంతరకరమైన కంటెంట్ ఉంటే పౌరులు కంప్లైంట్ చేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 6
3. ఫిర్యాదులను పరిష్కరించేందుకు ఏర్పాటయ్యే వ్యవస్థ పారదర్శకంగా ఉంటుందని, పౌరులకు మేలు చేస్తుందని కేంద్ర సమాచార ప్రసారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో పాటు బ్రాడ్‌క్యాస్టర్స్ ఏర్పాటు చేసే స్వీయ నియంత్రణ సంస్థలు కేంద్ర ప్రభుత్వం దగ్గర రిజిస్టరై ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 6
4. ఈ నోటిఫికేషన్ చాలా ముఖ్యమైనదని, ప్రజల ఫిర్యాదులను పరిష్కరించడానికి బలమైన వ్యవస్థ ఏర్పాటుకు ఉపయోగపడుతుందని, ప్రసార సంస్థలు, వారి స్వీయ నియంత్రణ వ్యవస్థలపై జవాబుదారీతనం, బాధ్యత ఉంటుందని కేంద్రం తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 6
5. ప్రస్తుతం కూడా ఇలాంటి వ్యవస్థ ఉంది. ప్రసార కార్యక్రమాలు, అడ్వర్టైజ్‌మెంట్స్‌పై వచ్చే ఫిర్యాదులను పరిష్కరించేందుకు ఇంటర్ మినిస్టీరియల్ కమిటీ ఉంది. దీంతో పాటు ప్రసార మాధ్యమాలు కూడా అంతర్గత స్వీయ నియంత్రణ యంత్రాగాన్ని కూడా ఏర్పాటు చేశాయి. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 6
6. ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారాలకు చట్టబద్ధత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం కేబుల్ టెలివిజన్ నెట్వర్క్ రూల్స్, 1994 లో సవరణలు చేసి చట్టబద్ధ వ్యవస్థ ఏర్పాటుకు అవకాశం కల్పించింది. (ప్రతీకాత్మక చిత్రం)