2. కానీ కొన్ని సంస్థలు ఇప్పటికీ వర్క్ ఫ్రమ్ హోమ్(Work From Home) విధానం అమలు చేస్తున్నాయి. మరికొన్ని కంపెనీలు హైబ్రిడ్ మోడల్‌ను అనుసరిస్తున్నాయి. అయితే ఇంటి నుంచి పని చేయడంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రొడక్టివిటీ తగ్గుతోందని, మూన్‌లైటింగ్ సమస్య ఉందని కొందరు చెబుతున్నారు. ప్రైవేటు రంగంలో వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు, ఎఫిషియన్సీపై చర్చ జరుగుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఈ క్రమంలో ప్రభుత్వం గురువారం.. 2023 డిసెంబర్ వరకు స్పెషల్ ఎకనామిక్ జోన్స్(సెజ్- SEZ)లోని ఐటీ యూనిట్ల ఉద్యోగులకు కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ అందిస్తున్నట్లు ప్రకటించింది. ఇందు కోసం స్పెషల్ ఎకనామిక్ జోన్స్ నిబంధనలను సవరించింది. కొన్ని షరతులకు లోబడి 2023 డిసెంబర్ 31 వరకు 100% వర్క్ ఫ్రమ్ హోమ్(WFH)ని అనుమతించడానికి SEZలోని IT/ITeS యూనిట్లను అనుమతించింది. (ప్రతీకాత్మక చిత్రం)
4. దీనికి సంబంధించి వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఓ నోటిఫికేషన్లో.. సెజ్‌లోని యూనిట్లు తమ ఉద్యోగులను ఇంటి నుంచి SEZ వెలుపల ఏదైనా ప్రదేశం నుంచి పని చేయడానికి అనుమతించవచ్చని పేర్కొంది. సెజ్ యూనిట్ యజమానులు ఈ అంశాన్ని సంబంధిత జోన్ల డెవలప్మెంట్ కమిషనర్‌కు తెలియజేయాలని, వారి ఆమోదం తర్వాత ప్రాంగణంలో నుంచి కార్యకలాపాలను కొనసాగించాలని నోటిఫికేషన్ షరతులు నిర్దేశించాయి. (ప్రతీకాత్మక చిత్రం)
6. SEZ యూనిట్లు WFHలో ఉన్న లేదా జోన్ వెలుపల పని చేస్తున్న ఉద్యోగుల జాబితాను సమర్పించకపోవచ్చు, కానీ యూనిట్ కింద అటువంటి జాబితాను మెయింటైన్ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. రిసల్టెంట్ ప్రొడక్ట్, సర్వీసెస్ ఎక్స్పోర్ట్ ఆదాయాన్ని యూనిట్ పరిగణనలోకి తీసుకుంటుందని, ఉద్యోగిని తప్పనిసరిగా అకౌంట్‌కు ట్యాగ్ చేయాలని పేర్కొంది. (ప్రతీకాత్మక చిత్రం)
7. వర్క్ ఫ్రమ్ హోమ్ సాఫీగా ఉండేలా ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌లు, ఇతర డివైజ్‌లను అందించడం గురించి నోటిఫికేషన్ వివరించింది. ఇంతకు ముందు అనుమతించిన ఒక సంవత్సరం వర్క్‌ఫ్రమ్ హోమ్ ఆప్షన్ని ఈ నోటిఫికేషన్ పొడిగించింది. మొత్తం ఉద్యోగులలో 50 శాతం మంది వరకు ఈ అవకాశం ఎక్స్టెండ్ కావచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)