1. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగులు మే 30, 31 తేదీల్లో సమ్మెకు దిగుతుండటంతో ఆ రెండు రోజులు బ్యాంకులు తెరుచుకోవన్న వార్తలు వస్తున్నాయి. మే 28 నాలుగో శనివారం, మే 29 ఆదివారం, మే 30, 31 బ్యాంకు ఉద్యోగుల సమ్మెతో వరుసగా నాలుగు రోజులు బ్యాంకులు తెరుచుకోవా అన్న ఆందోళన కస్టమర్లలో కనిపిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
2. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగులు రెండు రోజుల పాటు సమ్మెకు వెళ్తున్నారని గతంలోనే వార్తలు వచ్చాయి. పలు అంశాల్లో అసంతృప్తిగా ఉన్న పలు బ్యాంకుల ఉద్యోగులు కూడా ఇదే బాటపట్టొచ్చన్న వార్తలొచ్చాయి. అయితే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగులు మాత్రం మే 30, 31 తేదీల్లో సమ్మెలో పాల్గొంటారన్నది ఆ వార్తల సారాంశం. (ప్రతీకాత్మక చిత్రం)
3. అదే జరిగితే వరుసగా నాలుగు రోజుల పాటు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకింగ్ సేవలు అందవు. దీంతో కస్టమర్లలో ఆందోళన నెలకొంది. కానీ బ్యాంకు ఉద్యోగ సంఘాల సమాఖ్యతో జరిగిన చర్చల్లో రాజీ కుదిరిందని తాజాగా వార్తలొస్తున్నాయి. కాబట్టి ఆ రెండు రోజులు బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయని అధికారులు చెబుతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
4. బ్యాంకు ఉద్యోగులు రెండు రోజుల పాటు సమ్మెలో ఉంటారన్న ప్రచారాన్ని నమ్మకూడదని ఉన్నతాధికారులు తెలిపారు. కాబట్టి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్లో మే 30, 31 తేదీల్లో తెరిచే ఉంటాయన్న విషయాన్ని కస్టమర్లు గుర్తుంచుకోవాలి. మే 28 నాలుగో శనివారం, మే 29 ఆదివారం వీకెండ్ హాలిడేస్ కాబట్టి ఈ రెండు రోజులు బ్యాంకులు తెరుచుకోవు. (ప్రతీకాత్మక చిత్రం)
5. బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు వెళ్లాలనుకోవడం వెనుక అనేక కారణాలు ఉన్నాయి. ఔట్ సోర్సింగ్ ద్వారా ప్రైవేట్ ఉద్యోగాలు కల్పించడం, అన్ని రిక్రూట్మెంట్లు ఆపెయ్యడం, మరోవైపు ఎక్కువ సంఖ్యలో ఉద్యోగులు రిటైర్ అవుతుండటం, కేంద్ర ప్రభుత్వం సామాజిక సంక్షేమ పథకాలను బ్యాంకుల ద్వారా అమలు చేస్తుండటం లాంటి కారణాలతో పని ఒత్తిడి పెరుగుతుందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఇవే కాకుండా చాలావరకు బ్రాంచులను మూసేస్తుండటం, కీలకమైన నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో బ్యాంకు ఉద్యోగుల్ని పరిగణలోకి తీసుకోవడం, పెద్ద సంఖ్యలో బదిలీలు చేపడుతుండటం లాంటి సమస్యల్నీ బ్యాంకు ఉద్యోగులు ఎత్తి చూపుతున్నారు. ఇవే కారణాలతో బ్యాంకు ఉద్యోగులు ఇప్పటికే పలు మార్లు సమ్మెకు దిగారు. (ప్రతీకాత్మక చిత్రం)