వాస్తవానికి ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన ఏప్రిల్‌లోనే ధరలు పెంచాలని ఆయా కంపెనీలు భావించాయి. కానీ అప్పటికే కొనుగోళ్లు తక్కువగా ఉన్నాయి. మళ్లీ ధరలు పెంచితే.. మరింతగా తగ్గే అవకాశముందని డీలర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. అందువల్లే కంపెనీలు అప్పుడు వెనక్కి తగ్గాయి. ఇప్పుడు కొనుగోళ్లు పెరగడంతో ధరలను పెంచాయి. (ప్రతీకాత్మ కచిత్రం)
గత 3 రోజులుగా సిమెంట్ కంపెనీలు డీలర్లకు సరఫరాలు నిలిపివేశాయి. ఇప్పటికే ఉన్న పాత స్టాక్ మొత్తాన్ని విక్రయించాల్సిందిగా సూచించాయి. ఇప్పటికే చాలా చోట్ల పాత స్టాక్ అయిపోయింది. కొత్త ధర ప్రకారం.. సిమెంట్ సరఫరాను గురువారం సాయంత్రం నుంచి ప్రారంభించినట్లు సిమెంట్ విక్రయ డీలర్లు పేర్కొన్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
సిమెంట్‌తో పాటు స్టీల్, ఐరన్ ధరలు భారీగా పెరగడంతో.. సొంతిల్లు కట్టుకోవాలనుకునేవారికి అధిక భారం పడుతుంది. కేవలం నెలల వ్యవధిలోనే రేట్లు రెట్టింపవడంతో.. ఖర్చులు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రభుత్వాలు చొరవ చూసుకొని గృహ నిర్మాణంలో వినియోగించే సిమెంట్, ఐరన్, ఇసుక ధరలను తగ్గించాలి కోరుతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)