ITR Form: పన్ను చెల్లింపుదారులకు కేంద్రం అదిరే శుభవార్త.. ఇకపై అందరికీ..
ITR Form: పన్ను చెల్లింపుదారులకు కేంద్రం అదిరే శుభవార్త.. ఇకపై అందరికీ..
Income Tax Return | ట్యాక్స్ పేయర్లకు ముఖ్యమైన అలర్ట్. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై అందరికీ ఒకే ఐటీఆర్ ఫామ్‌ను అందుబాటులో ఉంచాలని భావిస్తోంది.
ITR Filing | పన్ను చెల్లింపుదారులకు తీపికబురు. కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్ తీసుకువస్తోంది. దీని ప్రకారం చూస్తే.. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ మరింత సులభతరం కానుంది. ఎలా అని అనుకుంటున్నారా? అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే.
2/ 10
ప్రస్తుతం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ దాఖలు చేయాలంటే ఒక్కొక్కరికి ఒక్కో ఫామ్ అందుబాటులో ఉంది. దీని వల్ల పన్ను చెల్లింపుదారుల్లో కొంత గందరగోళం ఉండొచ్చు. అయితే రానున్న కాలంలో ఈ సమస్య తొలగిపోనుంది.
3/ 10
పన్ను చెల్లింపుదారులు అందరికీ ఒకే ఐటీఆర్ ఫామ్‌ను అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర భావిస్తోంది. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా తాజాగా ఈ కామన్ ఐటీఆర్ ప్రతిపాదన చేసింది.
4/ 10
పన్ను చెల్లింపుదారులకు ఉన్న అన్ని ఐటీఆర్ ఫామ్స్‌ను కలిపి ఒక ఐటీఆర్ ఫామ్‌ను తీసుకురావాలని ఆదాయపు పన్ను శాఖ భావిస్తోంది. ఐటీఆర్ 7 మినహాయించి ఇతర అన్ని ఫామ్స్‌ను కలపాలని, ఒక కామన్ ఐటీఆర్ తీసుకురావాలని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ యోచిస్తోంది.
5/ 10
ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రతిపాదన ప్రకారం.. వర్చువల్ డిజిటల్ అసెట్స్ ద్వారా పొందే ఆదాయాన్ని మాత్రమే సపరేట్ ఫామ్ ద్వారా వెల్లడించాల్సి ఉంటుంది. ఇక మిగతా వాటికి ఒకే ఐటీఆర్ అందుబాటులోకి రావొచ్చు.
6/ 10
ట్రస్ట్‌లు, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్లు మినహాయించి పన్ను చెల్లింపుదారులు అందరూ ఒకే ఐటీఆర్ ఫామ్ ద్వారా రిటర్న్ దాఖలు చేయొచ్చు. ఈ అంశంపై కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు పరిశ్రమ వర్గాల సూచనలు, సలహాలు కోరింది.
7/ 10
డిసెంబర్ 15 వరకు సూచనలు, సలహాలు ఇవ్వడానికి గడువు ఉంది. తర్వాత సీబీడీటీ ఈ అంశాలను పరిశీలించి ఒక తుది నిర్ణయానికి వస్తుంది. ప్రతిపాదిత ఒకే కామన్ ఐటీఆర్‌లో మార్పులు చేర్పులు చేసి అమలులోకి తీసుకువస్తుంది.
8/ 10
ప్రస్తుతం పన్ను చెల్లింపుదారులు వారి ఐటీఆర్ దాఖలు చేయడానిక ఐటీఆర్ 1 నుంచి ఐటీఆర్ 7 వరకు ఫామ్స్‌ను ఎంచుకోవాల్సి ఉంది. అందరికీ ఒకే ఐటీఆర్ ఉండదు. ఉద్యోగులు, వ్యాపారులు, స్వయం ఉపాధి పొందుతున్న వారు.. ఇలా ఒక్కొక్కరికి ఒక్కో ఐటీఆర్ ఉంది.
9/ 10
అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా పన్ను చెల్లింపు విధానంలో మార్పులు తీసుకురావాలని కేంద్ర ఆర్థిక శాఖ భావిస్తోంది. అందుకే ఒకే ఐటీఆర ఫామ్‌ను తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది. ఐటీఆర్ 7 మినహా అన్ని కలిపిపోనున్నాయి.
10/ 10
అయితే పన్ను చెల్లింపుదారులకు రెండు ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. ఐటీఆర్ 1 నుంచి ఐటీఆర్ 4 వరకు ఫామ్స్ అలానే కొనసాగుతాయి. అందువల్ల ట్యాక్స్ పేయర్లు వీటిని ఎంచుకోవచ్చు. లేదంటే కొత్తగా తీసుకువస్తున్న ఒకే ఐటీఆర్ ఫామ్‌ను అయినా ఎంపిక చేసుకోవచ్చు. ఏ మార్గంలో అయినా ఐటీఆర్ దాఖలు చేసే వెసులుబాటు ఉంటుంది.