1. న్యూ ఇయర్‌కు కౌంట్ డౌన్ మొదలైంది. కొత్త సంవత్సరంలో కొత్త రూల్స్ (New Rules) అమల్లోకి రాబోతున్నాయి. ఎక్కువగా ఆర్థిక లావాదేవీలు (Financial Transactions) జరిపేవారితో పాటు సామాన్యులను ఈ కొత్త నియమనిబంధనలు ప్రభావితం చేయనున్నాయి. బ్యాంకులో క్యాష్ డిపాజిట్, ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర (LPG Gas Cylinder Price)... ఇలా అనేక అంశాల్లో కొత్త రూల్స్ అమల్లోకి వస్తాయి. మరి ఈ రూల్స్‌లో మిమ్మల్ని ప్రభావితం చేసే నియమనిబంధనలు ఏవో తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
2. Cash Deposit: ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) 2022 జనవరి 1 నుంచి క్యాష్ డిపాజిట్, క్యాష్ విత్‌డ్రాయల్ లావాదేవీలపై ఛార్జీలు వసూలు చేయనుంది. బేసిక్ సేవింగ్స్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్లకు ఈ ఛార్జీలు వేర్వేరుగా ఉంటాయి. బ్యాంకు ఖాతాను బట్టి ఉచిత లిమిట్ ఉంటుంది. ఫ్రీ లిమిట్ దాటిన తర్వాత క్యాష్ విత్‌డ్రాయల్, క్యాష్ డిపాజిట్లపై 0.50 శాతం లేదా కనీసం రూ.25 ప్రతీ లావాదేవీకి చెల్లించాలి. (ప్రతీకాత్మక చిత్రం)
3. LPG Price: ఆయిల్ కంపెనీలన్నీ గ్యాస్ సిలిండర్ల ధరల్ని ప్రతీ నెలా ఒకటో తేదీన సవరిస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో నెల మధ్యలో కూడా ధరల్ని మారుస్తుంటాయి. మరి కొత్త ఏడాదిలో గ్యాస్ సిలిండర్ల ధరలు పెరుగుతాయా, తగ్గుతాయా అన్నది జనవరి 1న తెలుస్తుంది. ఇండేన్ గ్యాస్, భారత్ గ్యాస్, హెచ్‌పీ గ్యాస్ సిలిండర్ల ధరలు పెరగొచ్చు లేదా తగ్గొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
4. Bank Lockers: బ్యాంకుల్లో లాకర్స్ మెయిన్టైన్ చేసేవారికి ఊరటనిచ్చింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI). బ్యాంకు నిర్లక్ష్యం వల్ల కస్టమర్ల లాకర్లలో వస్తువులు పోతే అందుకు బ్యాంకు బాధ్యత వహించాలని ఆర్బీఐ తెలిపింది. అగ్నిప్రమాదం, చోరీ, దోపిడీ, భవనం కూలిపోవడం లాంటి చర్యల్ని అడ్డుకోవాల్సిన బాధ్యత బ్యాంకుదేనని వెల్లడించింది. 2022 జనవరి నుంచి ఈ రూల్స్ అమల్లోకి రానున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
7. Hero MotoCorp: హీరో మోటార్ సైకిళ్లు, స్కూటర్ల ధరల్ని పెంచింది హీరో మోటోకార్ప్. పెరిగిన ధరలు 2022 జనవరి 4 నుంచి అమల్లోకి వస్తాయి. హీరో మోటోకార్ప్ స్కూటర్ లేదా బైక్ కొనాలంటే ఎక్స్-షోరూమ్ ధరపై రూ.2,000 వరకు అదనంగా చెల్లించాలి. 2021 జూలై నుంచి ఇప్పటి వరకు బైకులు, స్కూటర్లపై రూ.8,000 వరకు ధర పెంచింది హీరో మోటోకార్ప్. (ప్రతీకాత్మక చిత్రం)