1. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డుల టోకెనైజేషన్ కోసం గడువు పొడిగించిన సంగతి తెలిసిందే. ఈ గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తున్నట్టు గత నెల ప్రకటించింది. ఇప్పుడు ఆర్బీఐ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ (Credit Card) హోల్డర్స్‌కు కార్డ్ టోకెనైజేషన్ పట్ల అవగాహన కల్పిస్తోంది. వీలైనంత త్వరగా కార్డ్ టోకెనైజేషన్ పూర్తి చేయాలని కోరుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఇందుకోసం ఆన్లైన్లో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. కార్డ్ టోకెనైజేషన్ కోసం ముఖ్యమైన ఆరు స్టెప్స్ వివరిస్తోంది. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఉన్నవారు సులువుగా తమ కార్డును టోకెనైజ్ చేయొచ్చు. అసలు కార్డ్ టోకెనైజేషన్ అంటే ఏంటీ? కార్డ్ టోకెనైజేషన్ ఎందుకు చేయాలి? దీని వల్ల ఉపయోగమేంటీ? తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
3. మీరు ఆన్లైన్ షాపింగ్ చేసేప్పుడు కార్డుతో పేమెంట్స్ చేస్తున్నట్టైతే మీ కార్డు వివరాలు సేవ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. మీరు కార్డ్ వివరాలు సేవ్ చేస్తే మీ కార్డ్ నెంబర్ ఆ ఆన్లైన్ షాపింగ్ పోర్టల్ డేటాబేస్‌లో స్టోర్ అవుతోంది. ఇలా సంస్థలు యూజర్ల కార్డ్ వివరాలు సేవ్ చేసుకోకూడదని ఆర్బీఐ చెబుతోంది. దీని వల్ల క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ డేటా సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉంది. అందుకే కార్డ్ టోకెనైజేషన్ విధానాన్ని తీసుకొచ్చింది ఆర్బీఐ. (ప్రతీకాత్మక చిత్రం)
4. మీరు మీ కార్డ్ టోకెనైజ్ చేస్తే మీ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ డేటా సురక్షితంగా ఉంటుంది. ఉదాహరణకు మీరు ఏదైనా ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫామ్లో మీ కార్డు టోకెనైజ్ చేశారనుకుందాం. కార్డ్ ఆన్ ఫైల్ టోకెనైజేషన్ పద్ధతి ద్వారా మీ కార్డ్ వివరాలకు ప్రత్యామ్నాయంగా టోకెన్ క్రియేట్ అవుతుంది. అంటే మీ కార్డ్ నెంబర్ సదరు ప్లాట్‌ఫామ్ డేటాబేస్‌లో సేవ్ కాదు. కేవలం టోకెన్ మాత్రమే క్రియేట్ అవుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. మీరు టోకెన్ క్రియేట్ చేసిన తర్వాత ఎప్పుడు షాపింగ్ చేసినా సీవీవీ, ఓటీపీ ఎంటర్ చేసి పేమెంట్ ప్రాసెస్ పూర్తి చేయొచ్చు. దీని వల్ల మీ కార్డు నెంబర్ కాకుండా టోకెన్ మాత్రమే సదరు సంస్థ దగ్గర ఉంటుంది కాబట్టి మీ కార్డు వివరాలకు వచ్చిన ముప్పేమీ ఉండదు. ఇలా మీరు వేర్వేరు ప్లాట్‌ఫామ్స్‌లో కార్డ్ టోకెనైజేషన్ చేయొచ్చు. కార్డ్ టోకెనైజేషన్ ఎలా చేయాలో ఆర్బీఐ ట్విట్టర్లో వివరించింది. ఈ ఆరు స్టెప్స్ ఫాలో అవండి. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఏదైనా ఇకామర్స్ వెబ్సైట్ లేదా మర్చంట్ వెబ్సైట్ లేదా యాప్ ఓపెన్ చేసి పేమెంట్ ప్రాసెస్ ప్రారంభించండి. చెకౌట్ సమయంలో మీ క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ వివరాలను ఎంటర్ చేయండి. Secure your card లేదా Save card as per RBI guidelines ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఆ తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ లేదా ఇమెయిల్ ఐడీకి వచ్చే ఓటీపీ ఎంటర్ చేయండి. మీ కార్డు వివరాలకు బదులుగా టోకెన్ జనరేట్ అవుతుంది. మీరు మళ్లీ అదే వెబ్సైట్ లేదా మొబైల్ యాప్‌లో ట్రాన్సాక్షన్ చేస్తే మీ కార్డులోని చివరి నాలుగు అంకెలు కనిపిస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)