భారతీయ రోడ్లపై ప్రతియేటా లెక్కలేనన్ని యాక్సిడెంట్ (Accidents) జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ఈ యాక్సిడెంట్స్ తగ్గించేందుకు రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ వీలైనన్ని చర్యలు తీసుకుంటోంది. దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదాలు జరిగినా, ఆ ప్రమాదాల్లో వాహనదారులు ప్రాణాలు కోల్పోకుండా ఉండేందుకు సరికొత్త ప్రతిపాదనలను తీసుకొస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
అయితే రోడ్డు ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీ (Road Transport Ministry) ఇటీవల చేసిన ఒక ప్రతిపాదనను పునఃసమీక్షించాలని మారుతి సుజుకి ఇండియా (MSI) కోరింది. ప్రయాణీకుల వాహనాల (Passenger Vehicles)లో ఆరు ఎయిర్‌బ్యాగ్ (Airbags)లను తప్పనిసరి చేయాలని ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం ఒక ప్రతిపాదన చేసింది. ఇదే ప్రతిపాదనను ప్రభుత్వం పునఃపరిశీలించాలని మారుతి విజ్ఞప్తి చేస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
రక్షక కవచంలా పనిచేసే ఎయిర్‌బ్యాగ్‌లు డ్రైవర్‌తో పాటు ప్రయాణీకుల ప్రాణాలను రక్షిస్తాయి. మరి ఇలాంటి లైఫ్ సేవింగ్ ఎయిర్‌బ్యాగ్స్‌ను కార్స్లో ఎక్కువగా ఇవ్వాలని ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలో తప్పేముంది? మారుతి సుజుకి ఈ ప్రతిపాదనపై ఎందుకు అసంతృప్తి వ్యక్తం చేస్తుంది? ఎందుకు పునరాలోచించాలని కోరుతోంది? వంటి వివరాలు ఇప్పుడు పరిశీలిద్దాం. (ప్రతీకాత్మక చిత్రం)
ప్యాసింజర్ కార్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్స్‌ను ఇవ్వాలనే నియమం ఇప్పటికే తగ్గిపోతున్న స్మాల్ కార్ల మార్కెట్‌కు పెద్ద ఎదురు దెబ్బ అవుతుందని... ఆటో రంగంలో ఉద్యోగాలపై కూడా ప్రభావం చూపుతుందని మారుతి చెబుతోంది. ఈ నియమం అమలులోకి వస్తే గత మూడేళ్లుగా పేలవమైన అమ్మకాలతో కుదేలైన కాస్ట్-సెన్సిటివ్ ఎంట్రీ-లెవల్ కార్ సెగ్మెంట్‌పై తీవ్ర నెగిటివ్ ఎఫెక్ట్ పడుతుందని మారుతి అభిప్రాయపడింది. అదనంగా అందించే ఎయిర్‌బ్యాగ్స్ వల్ల కారు ధర పెరుగుతుందని.. ఫలితంగా చిన్న కార్లకు అప్‌గ్రేడ్ చేసుకోవాలని టూవీలర్ వాహనదారులకు స్మాల్ కార్ కొనడం అసాధ్యంగా మారుతుందని దేశీయ ఆటో దిగ్గజం పేర్కొంది.
ఈ ఏడాది ప్రారంభంలో, రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ 2022, అక్టోబర్ నుంచి ప్రయాణీకుల భద్రత కోసం 8 మంది వరకు ప్రయాణించగల మోటారు వాహనాల్లో కనీసం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను అందించడాన్ని కార్ల తయారీదారులకు తప్పనిసరి చేయనున్నట్లు తెలిపింది. మారుతి సుజుకి ఇండియా ఛైర్మన్ ఆర్.సీ భార్గవ మాట్లాడుతూ, ఏప్రిల్ 1, 2020 నుంచి భారత్ స్టేజ్ వెహికల్ స్టాండర్డ్స్ (BSVI) విధానంతో సహా గత కొన్నేళ్లలో వివిధ నియంత్రణ నిబంధనలను అమలు చేయడం వల్ల ఎంట్రీ-లెవల్ కార్ల ధర ఇప్పటికే గణనీయంగా పెరిగిందని తెలిపారు.
ధరలు పెరగడంతో, దేశవ్యాప్తంగా నాన్-మెట్రో మార్కెట్లలో స్మాల్ కార్ల అమ్మకాలు భారీగా తగ్గాయని భార్గవ తెలిపారు. ఆరు ఎయిర్‌బ్యాగ్స్ నిబంధన అమల్లోకి వస్తే.. ధరలు భగ్గుమంటాయని.. దేశీయ స్మాల్ కార్ ఇండస్ట్రీపై మరింత ప్రతికూల ప్రభావం పడుతుందని ఆయన హెచ్చరించారు. "ఆరు ఎయిర్‌బ్యాగ్‌ల వల్ల స్మాల్ కారు విక్రయాలు మరింత క్షీణిస్తాయనే భయం ఉంది. కార్ల తయారీ రంగం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఈ రంగం పెద్ద జాబ్ క్రియేటర్‌గా ఉంటుంది. ఏదైనా కారును మార్కెట్లో విక్రయించినప్పుడు అది చాలా ఉద్యోగాలను సృష్టిస్తుంది. డ్రైవర్లు, నిర్వహణ, మరమ్మతులు మొదలైనవి" అని భార్గవ పేర్కొన్నారు. "గత మూడేళ్లలో జరుగుతున్నట్లుగా కార్ల మార్కెట్ వృద్ధి చెందకపోతే అది ఉద్యోగాల సృష్టి, ఆర్థిక వృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది" అని అభిప్రాయపడ్డారు. (ప్రతీకాత్మక చిత్రం)
ఎయిర్‌బ్యాగ్‌ల అదనంగా యాడ్ చేయడం వల్ల కార్ల ధరలు ఎంత పెరుగుతాయని అడిగినప్పుడు... "నాకు కచ్చితంగా తెలియదు కానీ రూ. 20,000-25,000 వరకు పెరగొచ్చు. ఈ మొత్తం చిన్న కార్లను కొనుగోలు చేసేవారికి చాలా భారంగా మారుతుంది" అని భార్గవ వెల్లడించారు. "ఆరు ఎయిర్‌బ్యాగ్ నిబంధనలను తీసుకురానున్న తొలి దేశం మనదే కావచ్చేమో.. కానీ ఇది సరైన సమయం కాదని భావిస్తున్నా" అని ఆయన తెలిపారు. ప్రభుత్వం ఈ విషయాన్ని పునరాలోచించాలని మేం కోరుతున్నాం" అని భార్గవ అన్నారు. ప్రభుత్వం ప్రకారం, వాహనం ధర/వేరియంట్‌తో సంబంధం లేకుండా అన్ని విభాగాలలోని ప్రయాణీకులకు ఎయిర్‌బ్యాగ్‌లు రక్షణ కల్పిస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
తాజా ప్రభుత్వ గణాంకాల ప్రకారం, 2020లో ఎక్స్‌ప్రెస్‌వేలతో సహా జాతీయ రహదారులపై (NHలు) మొత్తం 1,16,496 రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. ఈ ప్రమాదాల్లో 47,984 మంది మరణించారు. రోడ్డు ప్రమాదాల విషయంలో ఎయిర్‌బ్యాగ్‌లు ప్రాణాలను రక్షించడంలో సహాయపడతాయని అంగీకరిస్తూనే, నియంత్రణ కారణంగా ఖర్చు పెరగడం, చాలా మంది ద్విచక్ర వాహనాలు ఎంట్రీ-లెవల్ కార్లకు అప్‌గ్రేడ్ కాలేకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయని భార్గవ పేర్కొన్నారు. కార్లతో పోలీస్ స్టేట్ టూ వీలర్స్ నడిపే వారికి ఎక్కువ ప్రమాదం పొంచి ఉందని అన్నారు. అందుకే వారు కేవలం టూవీలర్స్కే పరిమితం కాకుండా ఫోర్ వీలర్స్ కొనుగోలు చేసేలా ధరలను పెరగకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందన్నారు.