18 నెలల నుంచి 3 ఏళ్ల టెన్యూర్‌లోని ఎఫ్డీలపై గరిష్టంగా 7.5 శాతం వడ్డీ ఉంది. అలాగే సీనియర్ సిటిజన్స్‌కు అయితే 8 శాతం వరకు వడీ వస్తుంది. ఇది ఆకర్షణీయ వడ్డీ రేటు అని చెప్పుకోవచ్చు. 7 రోజుల నుంచి ఏడాది వరకు ఎఫ్డీలపై 6.75 శాతం వరకు వడ్డీ ఉంది. ఏడాది నుంచి 18 నెలల ఎఫ్డీలపై అయితే 7.25 శాతం వస్తుంది. మూడేళ్ల నుంచి పదేళ్ల ఎఫ్డీలపై 7 శాతం వడ్డీ పొందొచ్చు.
ప్రభుత్వ రంగానికి చెందిన కెనరా బ్యాంక్ కూడా ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లు పెంచేసింది. డిసెంబర్ 19 నుంచి అంటే ఈ రోజు నుంచి రేట్ల పెంపు వర్తిస్తుంది. కస్టమర్లకు గతంలో కన్నాఇప్పుడు 55 బేసిస్ పాయింట్లు ఎక్కువ వడ్డీ లభిస్తుంది. 3.25 శాతం నుంచి 7 శాతం వరకు వడ్డీ వస్తోంది. సీనియర్ సిటిజన్స్‌కు 50 బేసిస్ పాయింట్లు అదనపు వడ్డీ లభిస్తుంది.
బ్యాంక్ 7 రోజుల నుంచి ఏడాదిలోపు ఎఫ్డీలపై 5.5 శఆతం వడ్డీని ఆఫర్ చేస్తోంది. ఏడాది ఎఫ్డీలపై 6.75 శాతం వడ్డీని ఇస్తోంది. ఏడాది నుంచి రెండేళ్ల ఎఫ్డీలపై 6.8 శాతం, 666 రోజుల ఎఫ్డీలపై 7 శాతం, రెండేళ్ల నుంచి మూడేళ్ల ఎఫ్డీలపై 6.8 శాతం, మూడేళ్ల నుంచి పదేళ్ల ఎఫ్డీలపై 6.5 శాతం వడ్డీని అందుబాటులో ఉంచింది.
అలాగే ఫెడరల్ బ్యాంక్ కూడా ఫిక్స్డ్ డిపాజిట్లపై రేట్లు పెంచేసింది. ఈ బ్యాంక్ కస్టమర్లకు 3 శాతం నుంచి 7.25 శాతం వరకు వడ్డీని అందిస్తోంది. ఇప్పటికే ఈ బ్యాంక్ ఎఫ్డీ రేట్ల పెంపు నిర్ణయం అమలులోకి వచ్చేసింది. రూ.2 కోట్ల లోపు ఎఫ్డీలకు ఇది వర్తిస్తుంది. సీనియర్ సిటిజన్స్‌కు 7.75 శాతం వరకు వడ్డీ వస్తుంది. ఇప్పటికే చాలా బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్లపై రేట్లు పెంచేశాయి.