బ్యాంక్ నుంచి కొత్తగా లోన్ తీసుకోవాలని భావించే వారు ఇకపై అధిక వడ్డీ రేటు చెల్లించుకోవాల్సి వస్తుంది. అలాగే ఇప్పటికే బ్యాంక్ నుంచి లోన్ తీసుకొని ఉంటే.. నెలవారీ ఈఎంఐ పైపైకి చేరుతుంది. ఇలా మొత్తంగా రుణ గ్రహాతలపై ప్రతికూల ప్రభావం పడుతుందని చెప్పుకోవచ్చు. రానున్న కాలంలో కూడా రుణ రేట్లు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆర్బీఐ మరోసారి రెపో రేటు పెంచనుందని తెలుస్తోంది.