Canara Bank Gold Loan | బంగారంపై రుణాలు తీసుకోవాలనుకునేవారికి శుభవార్త. ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన కెనెరా బ్యాంకు అతి తక్కువ వడ్డీ రేటుకే గోల్డ్ లోన్స్ అందిస్తోంది. వివరాలు తెలుసుకోండి.
1. కరోనా కష్టకాలంలో మీ దగ్గర ఉన్న బంగారాన్ని కొద్ది కాలానికి తాకట్టు పెట్టి అప్పు తీసుకోవాలని అనుకుంటున్నారా? కెనెరా బ్యాంకు తక్కువ వడ్డీకే బంగారంపై రుణాలను అందిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 6
2. వ్యాపారాలు చేసేవారు, ఇతర అవసరాలు ఉన్నవారు నగదు కొరతతో ఇబ్బందులు పడకుండా ఉండేందుకు తక్కువ వడ్డీకి లోన్స్ ఇస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 6
3. ఈ రుణాలను సులువుగా, వేగంగా తక్కువ వడ్డీకే మంజూరు చేస్తామంటోంది కెనెరా బ్యాంకు. వడ్డీ వార్షికంగా 7.65%. అంటే నెలకు 64 పైసలు మాత్రమే. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 6
4. వ్యక్తిగత అవసరాలకు, వ్యవసాయ పనులకు, వ్యాపార కార్యకలాపాలకు, ఆరోగ్య అవసరాలకు ఈ గోల్డ్ లోన్స్ తీసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 6
5. భారతదేశంలోని కెనెరా బ్యాంక్ బ్రాంచ్లల్లో గోల్డ్ లోన్ తీసుకోవచ్చు. గరిష్టంగా రూ.40 లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు. బంగారు నగలపై ఒక గ్రాముకు రూ.3,250 చొప్పున రూ.20 లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 6
6. గోల్డ్ లోన్ ఓవర్ డ్రాఫ్ట్ తీసుకుంటే ఒక గ్రాముకు రూ.3,850 చొప్పున రూ.20 లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు. పర్సనల్ లోన్ అయితే గ్రాముకు రూ.2,000 చొప్పున రూ.20 లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)