Debit Card | ప్రభుత్వ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంకుల్లో ఒకటిగా కొనసాగుతూ వస్తున్న కెనరా బ్యాంక్ తన కస్టమర్లకు షాకిచ్చింది. చార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ చార్జీల పెంపు నిర్ణయం ఫిబ్రవరి 13 నుంచి అమలులోకి వస్తుందని బ్యాంక్ తెలిపింది. దీంతో బ్యాంక్ కస్టమర్లపై ప్రతికూల ప్రభావం పడుతుందని చెప్పుకోవచ్చు.
డెబిట్ కార్డు ఇన్యాక్టివిటీ ఫీజు కూడా ఉంది. క్లాసిక్ కార్డులపై, ప్లాటినం కార్డులపై గతంలో ఎలాంటి చార్జీలు లేవు. ఇప్పుడు కూడా చార్జీలు లేవు. సెలెక్ట్ కార్డుకు కూడా ఇది వర్తిస్తుంది. అయితే బిజినెస్ కార్డులపై ఇది వరకు రూ. 300 డెబిట్ కార్డు ఇన్యాక్టివిటీ చార్జీలు ఉండేవి. అయితే ఇప్పుడు ఈ చార్జీలు లేవు .