1. కెనరా బ్యాంక్ (Canara Bank) కస్టమర్లకు ఒక గుడ్ న్యూస్. డిజిటల్ సేవల విస్తరణలో భాగంగా ఈ బ్యాంకు కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు బ్యాంకు కస్టమర్లు బ్రాంచ్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండానే రీ-కేవైసీ (Re-KYC) పూర్తి చేసే అవకాశం కల్పిచింది. కస్టమర్లు SMS లేదా ఈమెయిల్ ద్వారా రీ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయవచ్చని కెనరా బ్యాంక్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా తెలియజేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
4. కస్టమర్ తమ వ్యక్తిగత సమాచారంతో రీ-కేవైసీ ఫారమ్‌ను పూరించాలి. కస్టమర్ సెల్ఫ్ అటెస్టెడ్ ఐడెంటిటీ, రెసిడెన్షియల్ ప్రూఫ్ కాపీలను రీ-కేవైసీ ఫారమ్‌తో పాటు సమర్పించాల్సి ఉంటుంది. డాక్యుమెంట్లు, KYC ఫారమ్‌ల సమర్పణను బ్యాంక్ శాఖను సంప్రదించి భౌతికంగా అందజేయవచ్చు. లేదా డాక్యుమెంట్లను స్కాన్ చేసి నెట్ బ్యాంకింగ్ పోర్టల్‌లో అప్లోడ్ చేయవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
6. బ్యాంకు అకౌంట్‌తో లింక్ చేసిన కస్టమర్ ఈమెయిల్ ఐడీ ద్వారా రీ-కేవైసీని పూర్తి చేయవచ్చు. ఇందుకు REKYC అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి కస్టమర్ ఐడీని సబ్జెక్ట్‌గా rekyc@canarabank.comకి మెయిల్ పంపాలి. మెసేజ్ ద్వారా అయితే.. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి రీ-కేవైసీ చేయవచ్చు. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి REKYC అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి కస్టమర్ IDని టైప్ చేసి 56161కి సెండ్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
7. ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన రెండవ త్రైమాసికంలో ప్రభుత్వ యాజమాన్యంలోని కెనరా బ్యాంక్ నికర లాభం 89 శాతం పెరిగి రూ.2,525 కోట్లకు చేరుకుంది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో బ్యాంక్ రూ.1,333 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. 2020-21 ఇదే కాలంలో రూ.21,331.49 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ ఏడాది జూలై-సెప్టెంబర్ మధ్యకాలంలో రూ.24,932.19 కోట్లకు పెరిగిందని కెనరా బ్యాంక్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. (ప్రతీకాత్మక చిత్రం)