పెరిగిన ద్రవ్యోల్బణానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం డియర్నెస్ అలవెన్స్‌ను పెంచుకుంటూ వస్తోంది. ఏడాదికి రెండు సార్లు డీఏ పెంపు ఉంటుంది. జనవరి నుంచి జూన్ కాలానికి ఒకసారి పెంపు వర్తిస్తుంది. అలాగే జూలై నుంచి డిసెంబర్ కాలానికి రెండో సారి డీఏ పెంపు ఉంటుంది. సాధారణంగా కేంద్ర ప్రభుత్వం హోలీ పండుగకే డీఏ పెంపు ప్రకటన చేయొచ్చని చాలా మంది అంచనా వేశారు. కానీ అలా జరగలేదు.