కేంద్రం తాజా నిర్ణయంతో రూపే డెబిట్ కార్డు వాడే వారికి, భీమ్ యాప్ ద్వారా లావాదేవీలు చేసే వారికి ఊరట కలుగనుంది. కాగా 2022లో యూపీఐ ప్లాట్‌ఫామ్‌పై ఏకంగా 7404 కోట్ల ట్రాన్సాక్షన్లు జరిగాయి. వీటి విలువ ఏకంగా రూ. 125 లక్షల కోట్లుగా ఉంది. డిసెంబర్ నెలలో యూపీఐ ట్రాన్సాక్సన్ల విలువ ఏకంగా రూ. 12 లక్షల కోట్లు దాటేసింది.