Gold Jewellery | బంగారం కొనాలని ప్లాన్ చేస్తున్నారా? మీరు ఆన్లైన్లో డిజిటల్ గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేయాలని భావిస్తే.. మీకు ఒక ఆప్షన్ అందుబాటులో ఉంది. రోజూ రూ.10 నుంచి కూడా మీరు డబ్బులు పెట్టొచ్చు.
Gold Investments | బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే మీకు చాలా ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. నేరుగా బంగారం షాపుకు వెళ్లి పసిడి ఆభరణాలు కొనుగోలు చేయొచ్చు. ఇంకా పేటీఎం, ఫోన్‌పే వంటి వాటి ద్వారా ఆన్లైన్లో డిజిటల్ గోల్డ్ కొనొచ్చు.
2/ 12
లేదంటే గోల్డ్ ఈటీఎఫ్‌లలో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇలా మీకు చాలా ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. అయితే మీరు రోజుకు రూ.10 కూడా బంగారం కొనే ఛాన్స్ ఉంది. ఇది ఎలానో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.
3/ 12
డిజిటైజేషన్ పుణ్యమా అని చాలా ఫిన్‌టెక్ కంపెనీలు ఇప్పుడు చిన్న మొత్తంలోనే సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేసే అవకాశం కల్పిస్తున్నాయి. మైక్రో ఇన్వెస్టింగ్ ఫెసిలిటీని కల్పిస్తున్నాయి.
4/ 12
బంగారంలో కూడా ఇలా చిన్న చిన్న మొత్తంలో డబ్బులు పెట్టొచ్చు. ప్రతి రోజూ స్మాల్ అమౌంట్‌తో బంగారం కొనొచ్చు. ఎలా అని అనుకుంటున్నారా? ఈ విషయం తెలుసుకోవాల్సిందే.
5/ 12
బంగారంలో కూడా ఇలా చిన్న చిన్న మొత్తంలో డబ్బులు పెట్టొచ్చు. ప్రతి రోజూ స్మాల్ అమౌంట్‌తో బంగారం కొనొచ్చు. ఎలా అని అనుకుంటున్నారా? ఈ విషయం తెలుసుకోవాల్సిందే.
6/ 12
మైక్రో ఫైనాన్స్ ప్లాట్‌ఫామ్స్ అయితే దేశీఎంఎల్, గుల్లాక్ అనేవి ప్రతి రోజూ చిన్న మొత్తంలో డబ్బులు పొదుపు చేసే అవకాశం కల్పిస్తున్నాయి. తక్కువ మొత్తంలోనే ప్రతి రోజూ డబ్బులు పెట్టొచ్చు.
7/ 12
దేశీఎంఎల్ అనే ఫిన్‌టెక్ సంస్థ ఫైనాన్షియల్ అసెట్స్ వంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేయడం అనే సర్వీసులు అందిస్తోంది. ఇక గుల్లాక్ అనేది డిజిటల్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ సేవలు అందుబాటులో ఉంచింది.
8/ 12
గుల్లాక్ అనేది మొబైల్ యాప్. 24 క్యారెట్ల గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు. రోజుకు రూ.10 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. డెయిలీ సిప్ ఫీచర్ ఎంచుకోవాల్సి ఉంటుంది. అలాగే ఒకేసారి పెద్ద మొత్తంలోనే కూడా డబ్బులు పెట్టొచ్చు. దీర్ఘకాలంలో డబ్బులు పెట్టాలని భావించే వారికి ఇది మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు.
9/ 12
గూగుల్ ప్లేస్టోర్‌లోకి వెళ్లి గుల్లాక్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఇందులో రెండు సేవింగ్ ఆప్షన్లు ఉంటాయి. డెయిలీ అమౌంట్, ప్రతి ఖర్చుపై ఆదా అనే రెండు ఆప్షన్లను మనం గమనించొచ్చు. మనకు నచ్చిన దాన్ని ఎంచుకోవాలి.
10/ 12
ఆటో పే ఆప్షన్ ఎంచుకోవాలి. ఇలా చేయడం వల్ల తర్వాత రోజు నుంచి బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అవుతూ వస్తాయి. ఇలా మీరు ఎన్ని రోజులు అయితే ఇన్వెస్ట్ చేయాలని భావిస్తున్నారో అన్ని రోజులు ఇన్వెస్ట్ మెంట్లను కొనసాగిస్తూ వెళ్లొచ్చు.
11/ 12
మీరు పెట్టిన డబ్బులను గెల్లాక్ డిజిటల్ గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేస్తుంది. వార్షికంగా 10 శాతం వరకు రాబడి వస్తుంది. గుల్లాక్ సంస్థ ఈ ఇన్వెస్ట్మెంట్ల కోసం ఆగ్మంట్తో జత కట్టింది. ఇది డిజిటల్ గోల్డ్ సర్వీసులు అందిస్తుంది.
12/ 12
గుల్లాక్ ద్వారా ఇన్వెస్ట్ చేసిన వారు వారి డబ్బులను నేరుగా విత్‌డ్రా చేసుకోవచ్చు. లేదంటే డిజిటల్ గోల్డ్‌ను బంగారం రూపంలో ఇంటికి డెలివరీ పొందొచ్చు. ఇలా రెండు రకాల ఆప్షన్లు కూడా ఉన్నాయి.