1. భారతీయులకు, బంగారానికి విడదీయరాని బంధం ఉంటుంది. పొదుపు విషయానికి వస్తే భారతీయులకు బంగారం కూడా పొదుపు మార్గమే. అందుకే భారతీయుల బంగారం అవసరాలు 90 శాతం బంగారం దిగుమతుల ద్వారానే తీరుతోంది. 2022లో భారతదేశం ఏకంగా 36.6 బిలియన్ డాలర్ల విలువైన 706 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఇంత తక్కువ ధరకే బంగారం కొనాలంటే కొన్ని షరతులు ఉన్నాయి. డ్యూటీ ఫ్రీ బంగారం కొనడానికి భారతీయులు రూ.1,200 నుంచి రూ.1,800 మధ్య సస్టైనబుల్ డెవలప్మెంట్ ఫీజ్ చెల్లించాలి. దీంతో పాటు భూటాన్ ప్రభుత్వం టూరిస్ట్ సర్టిఫైడ్ హోటల్లో కనీసం ఒక రాత్రి బస చేయాలి. బంగారాన్ని కొనుగోలు చేసేందుకు పర్యాటకులు అమెరికా డాలర్లు కూడా తీసుకురావాలి. (ప్రతీకాత్మక చిత్రం)
6. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి పన్ను రహిత బంగారాన్ని కొనుగోలు చేయడానికి భూటాన్ అదే డాలర్‌ను సున్నా లాభంతో ఉపయోగిస్తుంది. భూటాన్‌లోకి ప్రవేశించే పర్యాటకులు సస్టైనబుల్ డెవలప్మెంట్ ఫీజ్ పేరుతో పిలిచే పర్యాటక పన్నును చెల్లించడాన్ని తప్పనిసరి చేసింది. ఇందుకోసం జాతీయ అసెంబ్లీ చట్టం చేసిన తర్వాత 2022లో భూటాన్‌లో సస్టైనబుల్ డెవలప్మెంట్ ఫీజ్ తప్పనిసరి చేయబడింది. (ప్రతీకాత్మక చిత్రం)
7. భారతీయులు ఒక వ్యక్తికి రోజుకు రూ.1,200 నుంచి రూ.1,800 మధ్య సస్టైనబుల్ డెవలప్మెంట్ ఫీజ్ చెల్లించాలి. ఇతర దేశాల నుండి వచ్చే సందర్శకులు 65 డాలర్ల నుంచి 200 డాలర్ల వరకు చెల్లించాలి. సాధారణంగా విలాసవంతమైన వస్తువులను అమ్మే, ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన డ్యూటీ-ఫ్రీ అవుట్లెట్ల ద్వారా డ్యూటీ ఫ్రీ బంగారం కొనొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
8. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ నిబంధనల ప్రకారం భారతీయ పురుషుడు రూ. 50,000 విలువైన బంగారాన్ని (సుమారు 20 గ్రాములు) తీసుకురావచ్చు. భారతీయ స్త్రీ రూ. 1 లక్ష విలువైన బంగారాన్ని (సుమారు 40 గ్రాములు) విదేశాల నుంచి భారతదేశానికి పన్ను లేకుండా తీసుకురావచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)