Business ideas: ఒకప్పుడు ప్రతి ఒక్కరూ ఇళ్లలోనే వండుకునేవారు... ఇప్పుడు చాలా మంది పార్సిల్స్ తెప్పించేసుకుంటున్నారు. వంటలు వండుకునేంత టైమ్ వారికి దొరకట్లేదు. పార్శిల్ ఫుడ్ కూడా చేత్తో తినేంత టైమ్ ఉండక చాలా మంది నూడుల్స్ (Noodles), ఫ్రైడ్ రైస్ లాంటివి ఆర్డర్ ఇస్తున్నారు. దాంతో... చైనా ఫుడ్ అయిన న్యూడుల్స్ వ్యాపారం బాగా డెవలప్ అయ్యింది. ఏటా ఇది పెరుగుతుందే తప్ప తగ్గట్లేదు. అందువల్ల నూడుల్స్ తయారీ వ్యాపారం ప్రారంభిస్తే మంచి లాభాలు వస్తాయి... వ్యాపారం కూడా కావాల్సినంతగా విస్తరించుకోవచ్చు. (image credit- youtube)
ఇండియాలో మ్యాగీ, నార్ వంటి చాలా బ్రాండ్ల నూడుల్స్ ఉన్నాయి. ఐతే... హోటళ్లు, రెస్టారెంట్లు, రెడీ టు ఈట్ స్టాళ్లలో స్థానికంగా తయారుచేసే నూడుల్స్ ఎక్కువగా వాడుతారు. వారికి తక్కువ ధరకే అవి లభిస్తాయి. అందువల్ల ఈ వ్యాపారం చేసేవారు... స్థానిక హోటళ్లు, రెస్టారెంట్లు, షాపులతో డీల్ కుదుర్చుకొని వారికి రెగ్యులర్గా సప్లై చేసినా మంచి లాభాలు పొందవచ్చు. (image credit- youtube)
ఈ మీ సేవ కేంద్రం ద్వారా మీ వ్యాపారానికి సంబంధించి పూర్తి వివరాలు పొందవచ్చు. అలాగే... ఎంత ఖర్చవుతుంది, ఎలా ప్రారంభించాలి, యంత్రాలు ఎలా పొందాలి, ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలేంటి... వంటి వివరాలు అన్నీ ఇక్కడ తెలుసుకోవచ్చు. మీకు కేంద్రప్రభుత్వం ముద్ర స్కీ్మ్ ద్వారా... రూ.50,000 నుంచి రూ.10 లక్షల వరకూ లోన్ ఇస్తోంది. దాన్ని పొంది వ్యాపారం ప్రారంభించవచ్చు. (image credit- youtube)
ఈ వ్యాపారానికి పోటీ తక్కువ. ఆల్రెడీ షాపులు, రెస్టారెంట్లకు ఎవరో ఒకరు సప్లై చేస్తూ ఉండి ఉంటారు. మీరు వారి కంటే తక్కువ ధరకు సప్లై చెయ్యగలిగితే... మీ సరుకే కొంటారు. తద్వారా వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు. షామియానా షాపుల వారితోనూ మాట్లాడుకుంటే... ఎక్కడైనా వేడుకలు జరిగినప్పుడు... మీ ద్వారా నూడుల్స్ సప్లై చేయవచ్చు. (image credit- youtube)
(Disclaimer: The material provided on this page is for information purposes only and should not be understood as an investment advice. Any opinion that may be provided on this page does not constitute a recommendation by telugu.news18.com We do not make any representations or warranty on the accuracy or completeness of the information that is provided on this page. If you rely on the information on this page then you do so entirely on your own risk.)