ఏ వ్యాపారం చెయ్యాలన్నా పెట్టుబడి కావాలి. పెట్టుబడి పెడితే... లాభాలు వస్తాయా... నష్టాలు రాకుండా చెయ్యగలమా... ఉన్న పెట్టుబడైనా వెనక్కి రాబట్టుకోగలమా... ఇలా ఎన్నో డౌట్స్ ఉంటాయి. ఈ రోజుల్లో తక్కువ పెట్టుబడితో... ఎక్కువ లాభం వచ్చే వ్యాపారం చేయడం అత్యవసరం. చాలా మంది అలాంటి వ్యాపారాలు ఏవైనా ఉన్నాయా అని ఎదురుచూస్తున్నారు. తెలుగు న్యూస్18 తరచుగా అలాంటి వ్యాపారాల వివరాలు అందిస్తోంది. వాటిలో ఒకటి ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. అదే బనానా చిప్స్ తయారీ. (ప్రతీకాత్మక చిత్రం)
మనకు జనరల్‌గా బంగాళాదుంప చిప్స్ సంగతి తెలుసు. ఆ చిప్స్ తినడానికి కరకరలాడుతూ బాగుంటాయి కానీ... ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అదే అరటిపండు చిప్స్ అయితే ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అదృష్టం కొద్దీ ఈ వ్యాపారంలో లాభాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఈ రోజుల్లో ఎక్కువ మంది ఆలూ నుంచి బనానా చిప్స్ వైపుకి మారిపోతున్నారు. ఐతే... ప్రస్తుతం మార్కెట్లో బనానా చిప్స్ తయారుచేస్తున్న కంపెనీలు చాలా తక్కువగా ఉన్నాయి. అందువల్ల ఇందులోకి ఎంటరైతే మంచి ఫ్యూచర్ ఉండే ఛాన్స్ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
బనానా చిప్స్ తయారీకి కావాల్సినవి: సాధారణ అరటిపండ్లు, నూనె, ఉప్పు, మసాలాలు. వీటికి అదనంగా ప్రత్యేక యంత్రాలు కావాలి. అవేంటో మనం ఇప్పుడు స్పష్టంగా తెలుసుకుందాం. ముఖ్యంగా అరటి చిప్స్ తయారీకి... అరటి తొక్కలు వలిచే యంత్రం, అరటిని సన్నగా కట్ చేసే స్లైసింగ్ మెషిన్, అరటి స్లైసెస్ను వేపేందుకు ఫ్రైయింగ్ మెషిన్, తయారైన చిప్స్‌కి మసాలాలు జతచేసి... ప్యాకింగ్ చేసే యంత్రం కావాలి. (ప్రతీకాత్మక చిత్రం)
50 కేజీల చిప్స్ తయారీకి అయ్యే ఖర్చు: మీరు 50 కేజీల బనానా చిప్స్ తయారుచెయ్యాలంటే మీకు 120 కేజీల కూర అరటిపండ్లు కావాల్సి ఉంటుంది. వాటి ధర మీకు దాదాపు రూ.1000 ఉంటుంది. వాటిని ఫ్రై చేసేందుకు మీకు 12 నుంచి 15 లీటర్ల నూనె కావాలి. దాని ధర మీకు రూ.1050 దాకా ఉంటుంది. అలాగే యంత్రాలు పనిచేయడానికి మీకు 10 నుంచి 11 లీటర్ల డీజిల్ కావాలి. దాని ధర రూ.900 దాకా ఉంటుంది. ఉప్పు, మసాలాల కోసం మరో రూ.150 అవసరం. (ప్రతీకాత్మక చిత్రం)
నెలకు రూ.లక్ష సంపాదించే ఛాన్స్: సపోజ్ మీరు కేజీ చిప్స్ అమ్మడం ద్వారా మీకు రూ.10 లాభం వస్తే... మీరు ఒక రోజులో రూ.4,000 లాభం పొందగలరు. ఈ లెక్కన మీరు నెలకు 25 రోజులు వ్యాపారం చేస్తే మీకు నెలకు రూ.1 లక్ష లాభం వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాపారం ప్రారంభించాలనుకునేవారు అన్నింటినీ ఆలోచించుకొని ఫైనల్‌గా తమ నిర్ణయం తాము సొంతంగా తీసుకోవడం మేలు. (ప్రతీకాత్మక చిత్రం)