కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. చాలా సంస్థలు నష్టాలను తగ్గించుకోవడానికి ఉద్యోగాల కోత విధించాయి. జీతాలు నిలిపేశాయి. కొన్ని అరకొర జీతాలను చెల్లిస్తూ వస్తాయి. ఈ క్రమంలో చాలా మంది కొలువులు కోల్పోయారు. ఇలాంటి విపత్కర పరిస్థితులు కొంత మందిని సొంత వ్యాపారం ప్రారంభించేలా ప్రేరేపించాయి. ఇటీవల ఇది ట్రెండ్‌గా మారింది. చాలా మంది సొంత వ్యాపారాలపై ఆసక్తి చూపుతున్నారు.
ఈ రోజుల్లో చాలా మంది కొత్తగా వ్యాపారాన్ని (Business) ప్రారంభించాలని కోరుకుంటున్నారు. అలాంటి వారిలో అనేక మంది ఎలాంటి వ్యాపారం చేయాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు. మీరు కూడా సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నారా? అయితే తక్కువ పెట్టుబడితో ఎక్కువ సంపాదించేగలిగే.. ఈ ఐదు ఫ్రాంచైజీల గురించి తెలుసుకోండి.
1. ఆధార్ కార్డ్ ఫ్రాంచైజీ : మీరు ఆధార్ కార్డ్ ఫ్రాంచైజీని తీసుకోవచ్చు. మీకు ఆధార్ కార్డ్ ఫ్రాంచైజీ కావాలంటే..ముందుగా మీరు UIDAI నిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణులు కావాలి. దీని తర్వాత సేవా కేంద్రాన్ని తెరవడానికి లైసెన్స్ ఇవ్వబడుతుంది. మీరు పరీక్షలో ఉత్తీర్ణత సాధించినప్పుడు,.. మీరు ఆధార్ ఎన్రోల్మెంట్ నంబర్ మరియు బయోమెట్రిక్ ధృవీకరణను పూర్తి చేయాలి. ఆ తర్వాత కామన్ సర్వీస్ సెంటర్ నుంచి రిజిస్ట్రేషన్ చేయవలసి ఉంటుంది.
2. SBI ATM ఫ్రాంచైజీ : మీరు వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే.. SBI యొక్క ATM ఫ్రాంచైజీని తీసుకోవచ్చు. అయితే.. ATM ఫ్రాంచైజీని తీసుకోవడానికి, మీరు ఒక స్థలాన్ని కలిగి ఉండాలి మరియు కొన్ని షరతులను నెరవేర్చాలి. ఏ బ్యాంకు కూడా సొంతంగా ఏటీఎంను ఇన్స్టాల్ చేసుకోదు. ఇందుకోసం కొన్ని కంపెనీలకు ఏటీఎంలను ఏర్పాటు చేసుకునే కాంట్రాక్టును బ్యాంకులు ఇస్తున్నాయి. ఈ ATM ఇన్స్టాలేషన్ కంపెనీలు విభిన్నంగా ఉంటాయి. ఇవి ప్రతిచోటా ATMలను ఇన్స్టాల్ చేయడానికి పని చేస్తాయి. మీరు కూడా మీ స్థలం లేదా ఇంట్లో ATMని ఇన్స్టాల్ చేసుకుని డబ్బులు సంపాదించవచ్చు.
3. పోస్టాఫీసు ఫ్రాంచైజీ : పోస్టాఫీసు ఫ్రాంచైజీ అంటే పోస్టాఫీసును తెరవడం ద్వారా డబ్బు సంపాదించవచ్చు. పోస్టాఫీసు ద్వారా రెండు రకాల ఫ్రాంచైజీలు ఇస్తారు. ఇందులో, మొదటి ఫ్రాంచైజీ అవుట్లెట్ మరియు రెండవది పోస్టల్ ఏజెంట్ల ఫ్రాంచైజీ. ఫ్రాంచైజీని తీసుకోవడానికి.. మీరు కేవలం 5000 రూపాయలు మాత్రమే ఖర్చు చేయాలి. ఫ్రాంచైజీని పొందిన తర్వాత.. మీరు కమీషన్ ద్వారా చాలా సంపాదించవచ్చు.
4. అమూల్ ఫ్రాంచైజీ : అమూల్ రెండు రకాల ఫ్రాంచైజీలను అందిస్తోంది. మొదటి అమూల్ అవుట్లెట్, అమూల్ రైల్వే పార్లర్ లేదా అమూల్ కియోస్క్ యొక్క ఫ్రాంఛైజీ. రెండోది అమూల్ ఐస్ క్రీమ్ స్కూపింగ్ పార్లర్ యొక్క ఫ్రాంఛైజీ. మీరు మొదటి దానిలో రూ. 2 లక్షలు పెట్టుబడి పెట్టాలి. అదే ఐస్ క్రీమ్ స్కూపింగ్ పార్లర్ కావాలంటే.., మీరు 5 లక్షలు పెట్టుబడి పెట్టాలి. ఇందులో నాన్ రిఫండబుల్ బ్రాండ్ సెక్యూరిటీగా 25 నుంచి 50 వేల రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది.
5. IRCTC టికెట్ ఏజెంట్: IRCTC సహాయంతో.. మీరు ప్రతి నెలా వేల రూపాయలు సంపాదించవచ్చు. దీని కోసం మీరు ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. దీని కోసం మీరు చేయాల్సిందల్లా టిక్కెట్ ఏజెంట్‌గా మారడమే. రైల్వే కౌంటర్లలో క్లర్క్‌లు టిక్కెట్లను ఇచ్చిన.. మీరు కూడా టికెట్ లు ఇవ్వచ్చు. భారతీయ రైల్వేలో మొత్తం రిజర్వేషన్ టిక్కెట్లలో 55 శాతం ఆన్లైన్ మోడ్ ద్వారా బుక్ అవుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. కాబట్టి ఆథరైజ్డ్ IRCTC టిక్కెట్ బుకింగ్ ఏజెంట్ గా అవ్వడం వల్ల మీకు డబ్బు సంపాదించడానికి మంచి అవకాశం లభిస్తుంది.