అయితే వ్యాపారాన్ని ప్రారంభించడానికి కోట్ల లేదా మిలియన్ల రూపాయలు అవసరమని చాలా మంది అనుకుంటారు. అయితే.. ఈ భావన ఏ మాత్రం నిజం కాదు. కొన్ని వేల రూపాయలతోనే మీ ఇంట్లోనే ఆధారిత వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఈ నేపథ్యంలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం అందించే బిజినెస్ ఐడియాలు మీ కోసం..(ప్రతీకాత్మక చిత్రం)
ఈ రోజుల్లో బ్యూటీ పార్లర్ బిజినెస్ మంచి ఆదాయ వనరుగా మారింది. మహిళలే కాదు పురుషులకు కూడా బ్యూటీ పార్లర్లు వస్తున్నాయి. మీకు ఈ బిజినెస్ పై ఆసక్తి ఉంటే.. తక్కువ ఖర్చుతోనే ప్రారంభించవచ్చు. కొన్ని మిషన్లు, పరికరాలు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. బేసిక్స్ పై శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రంగంలో నైపుణ్యం సాధిస్తే మీరు లక్షలు సంపాధించవచ్చు.(ప్రతీకాత్మక చిత్రం)
ట్రావెలింగ్ పై పెరుగుతున్న అభిరుచి ట్రావెల్ పరిశ్రమలో అనేక ఉద్యోగాలను సృష్టించింది. ట్రావెల్ ఏజెన్సీలు కూడా ఇందులో భాగం. ట్రావెల్ ఏజెంట్లు టికెట్ నుంచి మొదలై హోటల్ బుకింగ్ వరకు కస్టమర్ల అవసరాలను తీరుస్తారు. ట్రావెల్ ఏజెన్సీని ప్రారంభించడానికి పెద్దగా ఖర్చు ఉండదు. ఆదాయం మాత్రం అధికంగా ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)