ప్రస్తుతం మాంసాహార ప్రియులను దృష్టిలో ఉంచుకొని పెద్ద ఎత్తుల లాభాలు తెచ్చి పెట్టే వ్యాపారం ఏదైనా ఉందంటే అది చికెన్ సెంటర్ వ్యాపారం అనే చెప్పాలి. నిజానికి మాంసాహారంలో అత్యంత పౌష్టిక విలువలు కలిగి ఉండి, అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉన్న మాంసాహారం చికెన్ అనే చెప్పాలి. మాంసాహారంలో మటన్, పిష్, బీఫ్, పోర్క్ కన్నా చికెన్ ధర చాలా తక్కువ, మటన్ కేజీ ధర 500 నుంచి 600 వరకూ పలుకుతుంటే...చికెన్ మాత్రం కేజీ ధర..సుమారు రూ.150 వరకూ ఉంటుంది. సీజన్ ను బట్టి హెచ్చుతగ్గులు ఉంటుంటాయి. అయితే మాంసాహార ప్రియుల్లో మాత్రం చికెన్ పట్ల మమకారం తగ్గదనే చెప్పాలి.