కరోనా అనంతరం చాలా మంది ఆలోచన విధానంలో మార్పు వచ్చింది. ఉద్యోగం బదులుగా సొంత వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే వారి సంఖ్య పెరుగుతోంది. అయితే చాలా మంది తక్కువ పెట్టుబడితో బెస్ట్ బిజినెస్ ను ఎంచుకోవాలని భావిస్తున్నారు. అలాంటి వారు ఈ బిజినెస్ ను కేవలం రూ. 22, 000 వేలతో ప్రారంభించి నెలకు రూ. 50 వేలకు పైగా సంపాధించవచ్చు.(ప్రతీకాత్మక చిత్రం)
మీరు కార్ వాషింగ్ బిజినెస్ గురించి విని ఉంటారు. ఇది మీకు రోడ్డు పక్కన కనిపించే సాధారణ వ్యాపారంలా అనిపించవచ్చు. కానీ.. ఈ వ్యాపారంలో పెద్ద మొత్తంలో డబ్బు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వ్యాపారం మీకు చాలా లాభదాయకంగా ఉంటుంది. మీకు అదృష్టం కలిసి వస్తే మెకానిక్‌ని కూడా నియమించుకుని వాషింగ్ తో పాటు, మీరు కారు మరమ్మత్తు బిజినెస్ కూడా ప్రారంభించవచ్చు.(ప్రతీకాత్మక చిత్రం)
ఎలా ప్రారంభించాలి?: కార్ వాషింగ్ కోసం ప్రొఫెషనల్ మెషిన్ అవసరం. మార్కెట్లో అనేక రకాల యంత్రాలు ఉన్నాయి. ఈ యంత్రాల ధర రూ.12 వేల నుంచి రూ.లక్ష వరకు ఉంటుంది. మీరు చిన్న వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే, మీరు తక్కువ ఖర్చుతో కూడిన యంత్రాన్ని కొనుగోలు చేయవచ్చు. దీని కోసం మీరు రూ.14,000తో ఒక యంత్రాన్ని కొనుగోలు చేశారనుకుందాం.(ప్రతీకాత్మక చిత్రం)