ప్రారంభం ఇలా..
స్టేషనరీ వ్యాపారాన్ని ప్రారంభించడానికి.. 'షాప్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం' కింద నమోదు చేసుకోవాలి. స్టేషనరీ దుకాణాన్ని ప్రారంభించడానికి మీకు 300 నుండి 400 చదరపు మీటర్ల స్థలం అవసరం. తక్కువ పెట్టుబడితో ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. మెరుగైన స్టేషనరీ దుకాణం తెరవాలంటే కనీసం 50 నుంచి60 వేల రూపాయలు కావాలి. (ప్రతీకాత్మక చిత్రం)
దుకాణం ప్రమోషన్ ఇలా..
దుకాణం ప్రమోషన్ కోసం.. మీరు ముందుగా స్టేషనరీ దుకాణం పేరును ముద్రించి పంపిణీ చేయవచ్చు. ఇది కాకుండా పాఠశాల, కళాశాలలకు వెళ్లి విద్యార్థులకు మీ దుకాణం(షాప్) గురించి చెప్పవచ్చు. హోమ్ డెలివరీ సౌకర్యాన్ని అందించడం ద్వారా.. మీ వ్యాపారం త్వరగా అభివృద్ధి చెందుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
నెలకు రూ.40వేలకు పైగా..
మీరు బ్రాండెడ్ ఉత్పత్తులను విక్రయిస్తే.. 30 నుండి 40 శాతం వరకు ఆదా చేసుకోవచ్చు. ఒకవేళ స్థానిక ఉత్పత్తులను విక్రయిస్తే.. 2 నుండి 3 రెట్లు వరకు సంపాదించవచ్చు. మీరు 1 లక్ష రూపాయల ఖర్చుతో దుకాణాన్ని తెరిచినట్లయితే.. నెలలో 40 వేల రూపాయల వరకు సంపాదించవచ్చు. ఇంకెందు ఆలస్యం ఈ వ్యాపారాన్ని ప్రారంభించేందుకు అన్నీ సిద్ధం చేసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)