పారిశ్రామిక వాడలు, రసాయన పరిశ్రమలు ఉన్న ప్రాంతాల్లో ఏర్పాటు చేయకపోవడమే మంచిది. నీటి వనరులు ఉన్న ప్రాంతాలను ఎంపిక చేసుకుంటే అన్ని సీజన్లలో మంచి నీరు తయారు చేసుకునే అవకాశం ఉంది. ఇక మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టుకునేందుకు స్థానిక మున్సిపల్ ఆఫీస్‌లో లైసెన్స్ దరఖాస్తు చేసుకోవాలి. అలాగే FSSAI (Food Safety and Standards Authority of India), iso ల నుంచి పర్మిట్, సర్టిఫికెట్లను పొందాలి. స్థానిక అనుమతులు, ఇతర రిజిస్ట్రేషన్లను పూర్తి చేసుకొని ప్లాంట్ ఏర్పాటు చేసుకోవాలి.
మినరల్ వాటర్ ప్లాంటు ఏర్పాటు ఇలా...
మినరల్ వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించేందుకు.. భూగర్భ జలాలు అవసరం అందుకోసం బోరు వేయాలి. నీటిని స్టోర్ చేసేందుకు వాటర్ ట్యాంకులను ఏర్పాటు చేసుకోవాలి. అలాగే వాటర్ ట్యాప్‌లు, వాటర్ క్యాన్స్, వాటర్ ఫిల్లింగ్ మెషిన్లు కూడా అవసరం అవుతాయి.మినరల్ వాటర్ ప్లాంట్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోవాలి. ఒక షెడ్ తరహాలో అయితే శుభ్రమైన పరిసరాలను ఏర్పాటు చేసుకోవచ్చు. వాటర్ ప్లాంట్‌కు విద్యుత్ ఏర్పాట్లు చేసుకోవాలి.ఈ బిజినెస్‌ను ప్రారంభించేందుకు ఎంత పెట్టుబడి అవసరం అవుతుందో ఇప్పుడు చూద్దాం..
పెట్టుబడి ఎంతంటే..
వాటర్ ప్యూరిఫైర్ ఖరీదు రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు ఉంటుంది. పెద్ద ఎత్తున ప్లాంట్ ఏర్పాటు చేస్తే రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఖర్చవుతుంది. ఇతర సామగ్రికి రూ.30వేల నుంచి రూ.50వేల వరకు ఖర్చవుతుంది. కంపెనీ వారే ప్లాంట్‌ను ప్లేస్ చేసి వెళ్తారు. ప్లాంట్ ఎలా పనిచేస్తుందో వారే వివరిస్తారు. పనితీరుపై ఏదైనా సందేహాలు ఉంటే టెక్నిషియన్లు అందుబాటులో ఉంటారు. బోర్ నుంచి నీటిని తీసుకునే ప్యూరిఫైర్ ఆ నీటిని శుద్ధి చేసి స్టోరేజ్ట్యాంకుల్లోకి పంపుతుంది. దీంతో నీరు ఆ ట్యాంకుల్లో స్టోర్ అవుతుంది. మినరల్ వాటర్‌ను 20 లీటర్ల క్యాన్లలోకి నింపి సరఫరా చేస్తారు. ఇక ప్యూరిఫైర్ తో గంటకు 450 నుంచి 500 లీటర్ల వరకు నీటిని ప్యూరిఫై చేసే అవకాశం ఉంటుంది. మినరల్ వాటర్ ప్లాంట్ వ్యాపారం సహజంగా అన్ని రోజుల్లోనూ బాగానే ఉంటుంది. కాకపోతే వేసవిలో ఈ బిజినెస్ ఇంకా బాగా జరుగుతుంది. నీటిని ఎక్కువగా సప్లయి చేయగలిగితే ఎక్కువ లాభాలను వేసవిలో ఆర్జించవచ్చు.
లాభం పొందండిలా... గ్రామాల్లో 20 లీటర్ల వాటర్ క్యాన్‌ను రూ.5 నుంచి రూ.10 వరకు వసూలు చేస్తున్నారు. కమర్షియల్ ఆఫీసులు, షోరూంలకు రూ.35 వరకు విక్రయిస్తున్నారు. ఇక నీటిని హోం డెలివరీ చేస్తే అదనంగా మరో రూ.5 నుంచి రూ.10 వరకు ఎక్స్ట్రా వసూలు చేయవచ్చు. ఇక నార్మల్ వాటర్ క్యాన్‌పై రూ.4 వరకు ఖర్చు అయితే రూ.6 నుంచి లాభం పొందవచ్చు. అయితే నీటిని ద్వారా కూల్ చేసి కూల్ వాటర్‌ను కూడా సరఫరా చేయవచ్చు. ఈ క్రమంలో 15 లీటర్ల కూల్ వాటర్‌ను రూ.25 నుంచి రూ.30 వరకు విక్రయించవచ్చు. అదే నగరాల్లో అయితే రూ.40 వరకు విక్రయించవచ్చు. కూల్ వాటర్ క్యాన్ ద్వారా రూ.10 నుంచి లాభం పొందవచ్చు.
రోజుకు 200 నార్మల్ వాటర్ క్యాన్లను అమ్మితే లాభం కనీసం రూ.6 అనుకుంటే.. రోజుకు 200 X రూ.6 = రూ.1200 వరకు ఆర్జించవచ్చు. నెలకు 30రోజులు X 1200 = రూ.36,000 లాభం వస్తుంది. అదే రోజూ కనీసం 50 కూల్ వాటర్ క్యాన్లను అమ్మినా.. లాభం కనీసం రూ.10 అనుకుంటే.. 50Xరూ.10 = రూ.500 నెలకు 30 X రూ.500 = రూ.15,000 లాభం వస్తుంది. ఈ క్రమంలో నెలకు రెండు మొత్తాలు కలిపి రూ.36,000 + రూ.15,000 = రూ.51,000 వరకు సంపాదించవచ్చు.