ముంబైలో చాలా మంది ఏరోజు కారోజు ఉల్లిపాయలు కొయ్యరు. ఒకేసారి మూడ్రోజులుకు సరిపడా ఉల్లిని కోసేస్తారు. ఫ్రిజ్లో పెట్టుకుంటారు. ఎందుకో తెలుసా? రోజూ ఉల్లిని కోసేంత టైమ్ వారికి ఉండదు. ఇదే పరిస్థితి ఇప్పుడు చాలా చోట్ల ఉంది. విదేశాల్లోనైతే... ఉల్లిని వాడేవారు తక్కువ. అక్కడ ఉల్లి పొడి వాడుతారు. అదే ఈ బిజినెస్. మీరు ఉల్లి పొడిని తయారుచేసి.. లక్షల రూపాయలు సంపాదించే వీలు ఉంది.
దేశంలో ఉల్లిపాయలకు మంచి ధర లేదు. రైతులకు గిట్టుబాటు ధర లభించట్లేదు. ఇలాంటప్పుడు మీరు ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. రైతుల నుంచి డైరెక్టుగా మీరు తక్కువ ధరకు ఉల్లిపాయలను కొనవచ్చు. ఫలితంగా వారికి గిట్టుబాటు ధర ఇవ్వగలరు, మీకు కూడా తక్కువ ధరకు ఉల్లి లభిస్తుంది. ఈ ఉల్లితో మీరు.. ఉల్లి ఫ్రై, ఉల్లి పొడి చెయ్యవచ్చు.
రష్యా , జర్మనీ, ఫ్రాన్స్, UK వంటి దేశాలు భారతదేశం నుంచి డీహైడ్రేటెడ్ ఉల్లిని దిగుమతి చేసుకుంటాయి. అవగాహన లేకపోవడం వల్ల భారతదేశంలో డీహైడ్రేటెడ్ ఉల్లిపాయ వినియోగం చాలా తక్కువగా ఉంది. మీరు అవగాహన కల్పిస్తూ వ్యాపారాన్ని విస్తరించవచ్చు." width="888" height="590" /> చివరిగా రష్యా, జర్మనీ, ఫ్రాన్స్, UK వంటి దేశాలు భారతదేశం నుంచి డీహైడ్రేటెడ్ ఉల్లిని దిగుమతి చేసుకుంటాయి. అవగాహన లేకపోవడం వల్ల భారతదేశంలో డీహైడ్రేటెడ్ ఉల్లిపాయ వినియోగం చాలా తక్కువగా ఉంది. మీరు అవగాహన కల్పిస్తూ వ్యాపారాన్ని విస్తరించవచ్చు.