కరోనా ఎఫెక్ట్ తో చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. దీంతో అనేక మంది సొంతంగా బిజినెస్ ప్రారంభించాలని ప్లాన్లు చేస్తున్నారు. అలాంటి వారి కోసం బెస్ట్ బిజినెస్ ఐడియా మీ కోసం.. అదే బిస్కెట్ల తయారీ వ్యాపారం. స్త్రీ, పురుషులు ఎవరైనా ఈ బిజినెస్ చేసుకోవచ్చు. కాలంతో పాటు పెరుగుతున్న వెరైటీలతో మార్కెట్లో బిస్కెట్లకు డిమాండ్ కూడా పెరుగుతోంది. బిస్కెట్ తయారీ వ్యాపారం ద్వారా మనం సులభంగా లాభాన్ని కూడా పొందవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
మన దేశంలో సగానికి పైగా ప్రజలు ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం టీ లేదా పాలతో పాటు స్నాక్స్ గా బిస్కెట్లను తింటారు. బిస్కట్లు ప్రతిరోజూ ఎక్కువగా వినియోగించబడే ఆహారాలలో ఒకటి. కాబట్టి బిస్కెట్లకు మార్కెట్ చాలా పెద్దదని ఖచ్చితంగా చెప్పవచ్చు. అయితే మీరే స్వయంగా మార్కెటింగ్ చేసుకోవడం ద్వారా మంచి లాభాలు పొందొచ్చు.(ప్రతీకాత్మక చిత్రం)
ఈ బిజినెస్ ను రూ.4 నుంచి 5 లక్షల నామమాత్రపు పెట్టుబడితో ప్రారంభించవచ్చు. బిస్కెట్ తయారీ వ్యాపారాన్ని ప్రారంభించడానికి ప్రధాన మంత్రి ముద్రా యోజన పథకం కింద ఆర్థిక సహాయం కూడా పొందొచ్చు. ముద్రా యోజన పథకం ద్వారా ఈ వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే రూ. 75,000 నుంచి రూ. 90,000 వరకు పెట్టుబడి పెడితే సరిపోతుంది. ఈ వ్యాపారంతో మీరు నెలకు 30 నుండి 40 వేల వరకు లాభం పొందే అవకాశం ఉంటుంది.(ప్రతీకాత్మక చిత్రం)
బిస్కెట్ తయారీ ప్లాంట్ ఏర్పాటు, మేకింగ్ ఖర్చు సుమారు రూ. 4 నుంచి 5 లక్షల వరకు అవుతుంది. మీ వద్ద రూ. 90 వేలు ఉంటే చాలు మీరు ప్రధాన మంత్రి ముద్రా యోజన పథకం ద్వారా మిగిలిన మొత్తాన్ని పొందవచ్చు. ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు 450 నుంచి 650 చదరపు అడుగుల స్థలం ఉండాలి. మీరు ఈ స్థలాన్ని అద్దెకు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది.(ప్రతీకాత్మక చిత్రం)
ప్రధాన మంత్రి ముద్రా యోజన పథకం కోసం మీరు మీ సమీపంలోని బ్యాంక్ బ్రాంచ్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దీని కోసం మీరు దరఖాస్తు ఫామ్‌ను పూర్తిగా నింపాలి. ఈ ఫారమ్‌లో మీ పేరు, విద్య, నివాస చిరునామా, ఆదాయం మరియు లోన్ మొత్తం వంటి వివరాలు ఉంటాయి. ఈ ప్లాన్‌కు హామీదారు అవసరం లేదు. ఈ రుణాన్ని 5 సంవత్సరాలలో తిరిగి చెల్లించవచ్చు.(ప్రతీకాత్మక చిత్రం)
మీరు ఇంటి నుంచి కూడా ఈ బిజినెస్ చేయవచ్చు. మీరు ఇంటి నుంచి ఈ వ్యాపారం చేయడం ద్వారా ఖర్చు తగ్గించుకోవచ్చు. అయితే ఈ బిజినెస్ ప్రారంభించే ముందు ప్రభుత్వ నిబంధనల ప్రకారం బిస్కెట్లు తయారు చేసే స్థలంలో వేరే వస్తువులు తయారు చేయడానికి వీల్లేదు.NOCతో పాటు నీరు, లైట్ మరియు డ్రైనేజీ సౌకర్యాలను కలిగి ఉండాల్సి ఉంటుంది.(ప్రతీకాత్మక చిత్రం)
ఇంకా మీరు మీ కంపెనీని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ROC)తో ప్రైవేట్ లిమిటెడ్ లేదా లిమిటెడ్ కంపెనీగా నమోదు చేసుకోవాలి. జీఎస్టీ నంబర్ పొందిన తర్వాత మున్సిపల్ అథారిటీ నుంచి ట్రేడ్ లైసెన్స్ పొందాలి. బిస్కెట్లు ఆహార పదార్థం కాబట్టి, FSSAI కింద రిజిస్ట్రేషన్ తప్పనిసరి. ఇప్పటికే ఈ బిజినెస్ చేస్తున్న వారిని ఓ సారి సంప్రదించి వారి సలహాలు తీసుకోవడం మంచిది.(ప్రతీకాత్మక చిత్రం)