కాగా కేంద్ర ప్రభుత్వం 2018 బడ్జెట్లో ఈ స్టాండర్డ్ డిడక్షన్ అనే వెసులుబాటు తీసుకువచ్చింది. ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, మెడికల్ అలవెన్స్ స్థానంలో దీన్ని ప్రకటించారు. 2017-18 ఆర్థిక సంవత్సరం వరకు చూస్తే.. ట్రాన్స్‌ఫోర్ట్ అలవెన్స్ కింద రూ. 19,200 వరకు, మెడికల్ రీయింబర్స్మెంట్ కింద రూ. 15 వేల వరకు పన్ను తగ్గింపు పొందే ఛాన్స్ ఉండేది.
రూ. 75 వేల నుంచి రూ. 5 లక్షల వరకు ఆదాయం కలిగిన వారికి ఇది వర్తించేది. అలాగే రూ. 5 లక్షలకు పైన ఆదాయం కలిగి ఉంటే అప్పుడు స్టాండర్డ్ డిడక్షన్ అనేది రూ. 20 వేలుగా లభించేది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొత్త ట్యాక్స్ విధానంలో కూడా స్టాండర్డ్ డిడక్షన్ అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని వల్ల కొత్త ట్యాక్స్ విధానంలో పన్ను చెల్లించే ట్యాక్స్ పేయర్లకు ఊరట కలుగుతుంది.