ఈ డిడక్షన్స్‌ను క్లెయిమ్ చేసినా? కొత్త పన్ను విధానమే మెరుగైన ప్రయోజనాలు అందిస్తుందా? లేదా? రెండింటిలో ఏది బెస్ట్ అనే విషయంలో చాలా మంది అయోమయంలో ఉన్నారు. అయితే ఇప్పుడు రూ.10 లక్షల ఆదాయం పొందుతున్న ఉద్యోగికి ఈ రెండు పన్ను విధానాలలో ఎంత మేరకు పన్ను చెల్లించాల్సి వస్తుంది. ఎలాంటి ప్రయోజనాలు అందాయనే అంశాలు ఇప్పుడు పరిశీలిద్దాం.
* పాత పన్ను విధానం మేలు : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త పన్ను విధానంలో ఎగ్జమ్షన్ లిమిట్‌ను రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచారు. ట్యాక్స్ శ్లాబ్‌లను సరళీకరించారు. కొత్త పన్ను విధానం వైపు ప్రజలు వచ్చేలా ఆకర్షణీయంగా చూపించే ప్రయత్నాలు చేశారు. అయితే రూ.10 లక్షల ఆదాయం ఉన్న ఉద్యోగులకు కొత్త పన్ను విధానం కంటే పాత పన్ను విధానం మేలు. హైయర్ ట్యాక్స్ డిడక్షన్స్‌ను క్లెయిమ్ చేస్తే పాత పన్ను విధానం మెరుగ్గా ఉంటుంది.
* డిడక్షన్స్తో బెనిఫిట్ : ఈ డిడక్షన్స్‌లో రూ.50,000 స్టాండర్డ్ డిడక్షన్, రూ.2 లక్షల హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ డిడక్షన్, సెక్షన్ 80సీ కింద రూ. 1.5 లక్షల డిడక్షన్, సెక్షన్ 80డి కింద చెల్లించిన ఆరోగ్య బీమా ప్రీమియంలపై రూ.25,000 ట్యాక్స్ డిడక్షన్, నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పిఎస్)కి కింద రూ.50,000 డిడక్షన్ వంటివి ఉన్నాయి.
అయితే కేవలం రూ.2 లక్షల ట్యాక్స్ డిడక్షన్స్ క్లెయిమ్ చేస్తే, పాత పన్ను విధానం కంటే, కొత్త పన్ను విధానం మెరుగ్గా పని చేస్తుంది. బడ్జెట్ 2023 తర్వాత కొత్త పన్ను విధానం ప్రకారం ట్యాక్స్ అవుట్గో రూ.54,600కి తక్కువగా ఉంటుంది. కాబట్టి కొత్త పన్ను విధానానికి మారితే రూ.20,800 ఆదా చేసే అవకాశం ఉంటుంది. పాత పన్ను విధానంలో చెల్లించాల్సిన పన్ను రూ.75,400 కంటే ఎక్కువగా ఉంటుంది.