చాలా ఎక్కువ విలువ ఉండే ఇన్సూరెన్స్ పాలసీల ద్వారా వచ్చే ఆదాయంపై పొందే ట్యాక్స్ ఎగ్జమ్షన్ను పరిమితం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పుడు ఇలాంటి పాలసీపై ఆదాయపు పన్ను మినహాయింపు ఉండదు. 2023 ఏప్రిల్ 1 నుంచి.. ఇన్సూరెన్స్ పాలసీలపై చెల్లించిన ప్రీమియం (యులిప్స్ మినహాయించి) రూ. 5 లక్షలకు మించి ఉంటే, ఆ పాలసీల ద్వారా వచ్చే ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుంది. అయితే డెత్ బెనిఫిట్ ఉంటే ఈ రూల్ వర్తించదు.
అయితే సులభతర వ్యాపారం, KYC ప్రాసెస్ సింప్లిఫికేషన్, ఐడెంటిటీ, అడ్రస్ అప్డేట్ కోసం వన్-స్టాప్ సొల్యూషన్, కామన్ బిజినెస్ ఐడెంటిఫైయర్, యూనిఫైడ్ ఫైలింగ్, ఎంటిటీ డిజి లాకర్.. వంటి సేవలు ఇన్సూరెన్స్ ప్లేస్‌మెంట్‌ను సులభతరం చేస్తాయని, క్లెయిమ్ చెల్లింపును కూడా సులభతరం చేస్తాయని కొందరు విశ్లేషిస్తున్నారు.