1. కేంద్ర ప్రభుత్వం కొత్త పన్ను విధానంలో (New Tax Regime) చేసిన మార్పులు పన్ను చెల్లింపుదారుల్లో అనేక ప్రశ్నలకు, సందేహాలకు కారణం అవుతోంది. కొత్త పన్ను విధానం ఎంచుకోవడం మంచిదా? పాత పన్ను విధానంలోనే కొనసాగాలా? 2023-24 కేంద్ర బడ్జెట్లో (Union Budget 2023-24) ప్రకటించిన మార్పులతో ఎంతవరకు లాభం ఉంటుంది? ఇలా అనేక ప్రశ్నలు ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
3. రిబేట్ కలిపి లెక్కేస్తే ప్రస్తుతం కొత్త పన్ను విధానంలో రూ.5 లక్షల వరకు పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు. బడ్జెట్లో ఈ లిమిట్‌ను రూ.7 లక్షలకు పెంచుతున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. వార్షికాదాయం రూ.7 లక్షల లోపు ఉన్నవారికి రిబేట్‌తో పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఇక్కడే పన్ను చెల్లింపుదారుల్లో ఓ చిక్కు ప్రశ్న ఎదురవుతోంది. కొత్త పన్ను విధానంలో రిబేట్‌తో రూ.7,00,000 వరకు పన్ను లేదు. ఒకవేళ వార్షికాదాయం రూ.7,00,010 ఉంటే ఏంటీ పరిస్థితి? అంటే 7 లక్షల 10 రూపాయల వార్షికాదాయం ఉన్నవారు కొత్తగా ప్రకటించిన మార్పులతో ఎంత పన్ను చెల్లించాలన్న సందేహం ఉంది. దీనిపై ఢిల్లీకి చెందిన ఓ ఛార్టర్డ్ అకౌంటెంట్ ఓ ఉదాహరణ వివరించారు. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఉదాహరణకు 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఓ వ్యక్తికి రూ.7,00,000 వార్షికాదాయం ఉందనుకుందాం. రిబేట్ ఉంటుంది కాబట్టి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఒకవేళ అతని ఆదాయం కేవలం రూ.10 పెరిగితే అంటే రూ.7,00,010 వార్షికాదాయం ఉంటే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అప్పుడు ఆ వ్యక్తి రూ.26,001 పన్ను చెల్లించాలి. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఒకవేళ వార్షికాదాయం రూ.7,00,001 ఉంటే సెక్షన్ 288ఏ నిబంధనల ప్రకారం వార్షికాదాయాన్ని రూ.7,00,000 గా పరిగణిస్తారని, వారికి సెక్షన్ 87ఏ కింద రిబేట్ వస్తుంది కాబట్టి పన్ను వర్తించదని I.P. Pasricha & Co సంస్థకు చెందిన మనీత్ పాల్ సింగ్ News18 కి తెలిపారు. కానీ లిమిట్ కన్నా రూ.10 వార్షికాదాయం ఎక్కువగా ఉంటే రూ.26,001 పన్ను చెల్లించక తప్పదు. (ప్రతీకాత్మక చిత్రం)
7. కొత్త పన్ను విధానంలో గతంలో ఉన్న 6 శ్లాబ్స్‌ని 5 కి తగ్గించారు. రూ.3 లక్షల లోపు- పన్నులు ఉండవు, రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షలు- 5 శాతం, రూ.6 లక్షల నుంచి రూ.9 లక్షలు- 10 శాతం, రూ.9 లక్షల నుంచి రూ.12 లక్షలు- 15 శాతం, రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షలు- 20 శాతం, రూ.15 లక్షల కన్నా ఎక్కువ వార్షికాదాయం- 30 శాతం పన్నులు చెల్లించాలి. (ప్రతీకాత్మక చిత్రం)