కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు ఎలాంటి మార్పులు అవసరమే చర్చ మొదలవుతుంది. ఆయా రంగాలకు సంబంధించి తీసుకోవాల్సిన నిర్ణయాలను నిపుణులు వెల్లడిస్తుంటారు. బడ్జెట్ 2023కి కేవలం రెండు నెలల సమయం మాత్రమే ఉంది. చిన్న పెట్టుబడిదారులు ఎల్లప్పుడూ మోర్ ట్యాక్స్ డిడక్షన్స్, ఇన్కమ్ ట్యాక్స్ రేట్ల తగ్గింపు ఆశిస్తుంటారు.
యూనియన్ బడ్జెట్ ఆదాయాన్ని పెంచుకోవడానికి పన్ను భారాన్ని పెంచవచ్చని కొంతమంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పాత పెన్షన్ విధానాన్ని తిరిగి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాయి. దీంతో కొంతమంది మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్లు నేషనల్ పెన్షన్ స్కీమ్‌కు అధిక ట్యాక్స్ డిడక్షన్ పరిమితులను ఇవ్వడానికి సమయం ఆసన్నమైందని అభిప్రాయపడుతున్నారు. సెక్షన్ 80సి పన్ను మినహాయింపులు ద్రవ్యోల్బణం తో ముడిపడి ఉండాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఆర్థిక నిపుణుల అంచనాల గురించి ఇప్పుడు చూద్దాం. (ప్రతీకాత్మక చిత్రం)
పెట్టుబడులను ఆకర్షించాలి
యాక్సియమ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ దీపక్ ఛబ్రియా మాట్లాడుతూ.. పెట్టుబడిదారులు పన్ను చట్టాలలో అంచనా, స్థిరత్వాన్ని ఇష్టపడతారని చెప్పారు. పెట్టుబడిదారులకు ఇబ్బంది కలిగించే పన్నుల విషయంలో ప్రభుత్వం పెద్దగా మార్పులు చేయకూడదని అభిప్రాయపడ్డారు. ఇన్‌బిల్ట్ ప్రోత్సాహకాలతో పన్ను నియమాల రేషనలైజేషన్ పెట్టుబడులను ఆకర్షించాలని చెప్పారు.
ఇందులో అర్హత పొందే వాటిలో ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, సుకన్య సమృద్ధి యోజన, ఈక్విటీ-లింక్డ్ సేవింగ్ స్కీమ్‌లు (ELSS), నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్లు, ట్యాక్స్ సేవింగ్ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు, లైఫ్ ఇన్సూరెన్ష్ ప్రీమియం, హోమ్ లోన్ ప్రిన్సిపల్ రీపేమెంట్ వంటివి ఉన్నాయి. ఇది ఆర్థిక మంత్రి డిడక్షన్ పరిమాణాన్ని పెంచాల్సిన సమయమని భావిస్తున్నారు. కొంతమంది నిపుణులు కూడా సెక్షన్ 80C కింద ఉన్న పరిమితిని ద్రవ్యోల్బణంతో ముడిపెట్టడం మంచిదని, ధరలు పైకి ట్రెండ్ అయినప్పటికీ పొదుపు చేయడాన్ని పెంచుతుందని తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
ఎన్‌పీఎస్‌ని డిడక్షన్ లిమిట్ పెంపు
చాలా కుటుంబాలకు సోషల్ సెక్యూరిటీ ప్రధాన అంశం. ఇందు కోసం ప్రభుత్వం నేషనల్ పెన్షన్ స్కీమ్(NPS)ని ప్రారంభించింది. ఈ స్కీమ్‌ను పాపులర్ చేసేందుకు ట్యాక్స్ డిడక్షన్స్ స్ట్రింగ్‌ను ఆవిష్కరించింది. NPSకి ఆర్థిక సంవత్సరంలో రూ.50,000 వరకు చేసే కాంట్రిబ్యూషన్లపై సెక్షన్ 80CCD 1(B) కింద డిడక్షన్ లభిస్తుంది.(ప్రతీకాత్మక చిత్రం)
NPS స్థానంలో పాత పెన్షన్ పథకాన్ని అందించాలని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించిన తరుణంలో, ప్రభుత్వం NPSని మరింత ఆకర్షణీయంగా మార్చాలని భావించవచ్చని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. సోషల్ సెక్యూరిటీకి పెరుగుతున్న డిమాండ్‌తో ప్రభుత్వం ఎన్‌పీఎస్‌ని డిడక్షన్ లిమిట్‌ను రూ.50,000 నుంచి రూ.లక్షకు పెంచవచ్చని ప్లాన్ ఎహెడ్ వెల్త్ అడ్వైజర్స్ వ్యవస్థాపకుడు, చీఫ్ ఫైనాన్షియల్ ప్లానర్ విశాల్ ధావన్ చెప్పారు.
ట్యాక్స్ రేట్ల రేషనలైజేషన్
క్యాపిటల్ గెయిన్స్‌పై పన్ను విధించడం బడ్జెట్‌కు ముందు హాట్ టాపిక్ అయింది. వివిధ అసెట్ క్లాసెస్, ప్రొడక్టులు తక్కువ పన్నురేటు కింద అర్హత పొందేందుకు భిన్నమైన పన్ను రేట్లు, పరిమితులు ఉన్నాయి. ప్రభుత్వం దీని చుట్టూ ఉన్న సంక్లిష్టతలో కొంత భాగాన్ని అయినా తొలగించాలని చాలా మంది ఆశిస్తున్నారు.
లిస్టెడ్ బాండ్లను ఒక సంవత్సరం పాటు ఉంచితే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్‌గా పన్ను విధిస్తారు. అయితే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్‌గా పేర్కొనడానికి డెట్, రియల్ ఎస్టేట్, ఈక్విటీ ఫండ్లను వరుసగా మూడు, రెండు, ఒక సంవత్సరం పాటు ఉంచాలి. పన్ను రేటు కూడా మారుతూ ఉంటుంది. ఇలాంటివి గందరగోళానికి దారితీస్తున్నాయని, ప్రభుత్వం దీన్ని రేషనలైజ్ చేయాలని ధావన్ అన్నారు.
మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ మధ్య ట్యాక్స్ సమానత్వం
ఒకే అసెట్ క్లాస్‌లో పెట్టుబడి పెట్టే రెండు ప్రొడక్టులకు వేర్వేరు పన్ను రేట్లు ఉండటంపై సహజంగా పెట్టుబడిదారుల నుంచి విభిన్న ప్రతిస్పందనలు వస్తాయి. యూనిట్-లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ల (ULIP) వార్షిక ప్రీమియం రూ.2.5 లక్షల కంటే తక్కువగా ఉంటే, అందే మొత్తం చెల్లించిన ప్రీమియం కంటే కనీసం 10 రెట్లు ఉంటే, కనీసం ఐదేళ్లపాటు ఉంచితే పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. (ప్రతీకాత్మక చిత్రం)
అయితే ఈక్విటీ ఫండ్స్ ఎంతకాలం పాటు ఉంచుకున్నా, పెట్టుబడిదారుడు ఒక సంవత్సరం పూర్తయిన తర్వాత 10 శాతం చొప్పున లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ చెల్లించాలి. ULIP, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లాభాలపై పన్ను విధానంలో సమానత్వం అవసరమని ప్రూడెంట్ కార్పొరేట్ అడ్వైజరీ సర్వీసెస్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ షా చెప్పారు.