* ఆదాయపు పన్ను రాయితీ (Income Tax Rebate) : ఈ బడ్జెట్లో ట్యాక్స్ రిబేట్‌ను పెంచారు. ప్రస్తుతం రిబేట్ కారణంగా రూ.5 లక్షల ఆదాయం పన్ను పరిధిలోకి రావట్లేదు. అయితే తాజాగా ఈ పరిమితిని రూ.7 లక్షలకు పెంచారు. అంటే మీరు కొత్త పన్ను విధానాన్ని ఎంచుకుంటే, మీ పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయంపై రూ.7 లక్షల వరకు ట్యాక్స్ రిబేట్ క్లెయిమ్ చేయవచ్చు.
* న్యూ ట్యాక్స్ రూల్స్ ఇప్పుడు డిఫాల్ట్ ఆప్షన్ : 2023-24 బడ్జెట్లో ప్రభుత్వం కొత్త పన్ను నిబంధనలను డిఫాల్ట్ ఆప్షన్‌గా మార్చింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా మాట్లాడుతూ వాలంటరీ ట్యాక్స్ విధానాన్ని ప్రభుత్వం మరింత ఆకర్షణీయంగా మార్చడానికి ప్రయత్నిస్తోందన్నారు. దీనివల్ల ప్రభుత్వం కొంత డబ్బును కోల్పోనుందని తెలిపారు.
* స్టాండర్డ్ డిడక్షన్ లిమిట్ పెంపు : కుటుంబ పెన్షనర్లతో సహా జీతాలు అందుకునే వారికి, పెన్షనర్లకు కొత్త పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్‌ను పొడిగించారు. పాత పన్ను విధానంలో రూ.50వేల స్టాండర్డ్ డిడక్షన్, ఇప్పుడు కొత్త పన్ను విధానంలో కూడా అమలవుతుంది. దీనివల్ల రూ. 15.5 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఆదాయం ఉన్న ప్రతి వేతన జీవులకు రూ. 52,500 మేర ప్రయోజనం ఉంటుంది. ప్రస్తుతం పాత పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ రూ. 50,000, ప్రొఫెషనల్ ట్యాక్స్ ట్యాక్స్ డిడక్షన్ గరిష్టంగా రూ. 2,500 ఉంది.
* MSMEs అండ్ ప్రొఫెషనల్స్ : 2023-24 బడ్జెట్లో చిన్న వ్యాపార సంస్థలు, నిర్దిష్ట ప్రొఫెషనల్స్ కోసం ఆర్థిక మంత్రి కీలక ప్రకటన చేశారు. సింప్లిఫైడ్ ట్యాక్స్ సిస్టమ్‌ను ఉపయోగించగల మైక్రో-ఎంటర్ప్రైజెస్/ MSME బిజినెస్‌ల పరిమితిని రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్లకు, కొన్ని ప్రొఫెషనల్స్‌కు పరిమితిని రూ.50 లక్షల నుంచి రూ.75 లక్షలకు పెంచారు.
5% కంటే ఎక్కువ నగదు రసీదులు లేని పన్ను చెల్లింపుదారులు, ప్రిసమ్టివ్ ట్యాక్స్‌కు అర్హులైన వ్యాపార సంస్థలు, ప్రొఫెషనల్స్‌కు పెంచిన పరిమితి వర్తిస్తుంది. ఇప్పటివరకు రూ.2 కోట్ల వరకు టర్నోవర్ ఉన్న మైక్రో-ఎంటర్ప్రైజెస్, రూ.50 లక్షల వరకు టర్నోవర్ ఉన్న నిర్దిష్ట ప్రొఫెషనల్స్ ఈ ప్రిసమ్టివ్ ట్యాక్స్ ప్రయోజనాన్ని పొందారు.