1. కొన్ని రకాల ఆర్థిక లావాదేవీలకు ఇక పాన్ కార్డ్ అవసరం ఉండకపోవచ్చు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. బడ్జెట్ 2023 లో కొన్ని మార్పులు చేసేందుకు కేంద్ర ఆర్థిక శాఖ కసరత్తు చ్సోందని వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం, పాన్ కార్డ్ వివరాలు అందించని ఆర్థిక లావాదేవీలకు 20% టీడీఎస్ వసూలు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 206AA ప్రకారం పన్ను వర్తించే రేటు తక్కువగా ఉన్నా, పాన్ కార్డ్ వివరాలు ఇవ్వని లావాదేవీలకు 20 శాతం టీడీఎస్ చెల్లించాలి. అయితే రాబోయే కేంద్ర బడ్జెట్ 2023-24లో, ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధార్ మద్దతుతో ఆర్థిక లావాదేవీలకు అనుమతివ్వనుంది. కాబట్టి కొన్ని లావాదేవీలకు పాన్ నెంబర్ అవసరాన్ని తొలగించాలని ప్రతిపాదించే అవకాశం ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. ప్రస్తుతం అన్ని బ్యాంకు ఖాతాలు దాదాపు ఆధార్‌తో లింక్ అయినట్టే. అన్ని పర్సనల్ బ్యాంక్ అకౌంట్స్‌కి ఆధార్ నెంబర్లు లింక్ అయ్యాయని బ్యాంకులు స్పష్టం చేస్తున్నాయి. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 139A(5E) నిర్దిష్ట లావాదేవీల కోసం పాన్ కార్డ్‌కు బదులుగా ఆధార్ వివరాలను అందించడానికి వినియోగదారులను అనుమతించాలని బ్యాంకర్లు కోరుతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
6. ప్రస్తుతం 18 రకాల లావాదేవీలు చేయాలంటే పాన్ కార్డ్ తప్పనిసరి. ఈ 18 లావాదేవీలకు పాన్ కార్డ్ సమర్పించకపోతే లావాదేవీలు జరిపినవారుకు చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆదాయపు పన్ను చట్టంలోని 114బీ రూల్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కన్స్యూలర్ ఆఫీసులు తప్ప అందరూ పాన్ కార్డు ఇవ్వాల్సిందే. (ప్రతీకాత్మక చిత్రం)
7. మోటార్ వాహనాల కొనుగోలు లేదా అమ్మకం, క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ అప్లికేషన్, రెస్టారెంట్లో ఒకేసారి రూ.50,000 కన్నా ఎక్కువ నగదు చెల్లింపు చేయడం, రూ.50,000 కన్నా ఎక్కువ మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ కొనడం, బ్యాంకులో ఒక రోజులో రూ.50,000 కన్నా ఎక్కువ నగదు డిపాజిట్ చేయడం... ఇలా పలు రకాల లావాదేవీలకు పాన్ నెంబర్ ఇవ్వడం తప్పనిసరి. (ప్రతీకాత్మక చిత్రం)