మగువలు మెచ్చని నిర్మల బడ్జెట్...మరింత ప్రియంకానున్న బంగారం
మగువలు మెచ్చని నిర్మల బడ్జెట్...మరింత ప్రియంకానున్న బంగారం
Budget 2019 | బంగారంపై సుంకాలు పెంచుతున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీంతో బంగారం, వెండి మరింత ప్రియంకానుంది.
బంగారం అంటే ఇష్టపడని మగువలు ఉండరు. నిర్మలా సీతారామన్ బడ్జెట్ మహిళలను నిరాశకు గురిచేస్తోంది. మగువులకు ఎంతో ఇష్టమైన బంగారంపై అదనపు పన్ను భారం మోపారు నిర్మలా సీతారామన్
2/ 7
బంగారంపై ఎక్సైజ్, కస్టమ్స్ సుంఖాలు పెంచుతున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
3/ 7
బంగారం సహా ఇతర విలువైన లోహాలపై కస్టమ్స్ సుంకాన్ని 10 శాతం నుంచి 12.5 శాతానికి పెంచారు. దీంతో బంగారంతో పాటు వెండి మరింత ప్రియంకానుంది.
4/ 7
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు పెరగడంతో పాటు డాలర్‌తో రూపాయి మారకం బలహీనపడటంతో బంగారం ధరలు ఇప్పటికే భారమయ్యాయి.
5/ 7
ఇప్పుడు బంగారంపై సుంకాలను మరింత పెంచడంతో ఆభరణాల ధరలు మరింత పెరగనున్నాయి.
6/ 7
అటు ఫ్యూచర్స్ మార్కెట్లో పదిగ్రాముల బంగారం శుక్రవారం రూ 600 మేర పెరిగింది.
7/ 7
బంగారం ధరలు పెరిగితే విక్రయాలు మరింత తగ్గే అవకాశముందని జ్యువలరీ దుకాణదారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.