1. ఫోర్ డే వర్క్ వీక్... అంటే వారానికి నాలుగు రోజుల పని. మిగతా మూడు రోజులు వీకాఫ్. గతేడాదిగా ఈ వర్క్ కల్చర్ ట్రెండింగ్‌గా మారింది. యూకేకి చెందిన కంపెనీలు 4 రోజుల పనిదినాల (Four-Day Work Week) ట్రయల్‌ను గతేడాది నుంచి చేపట్టాయి. ఈ వర్కింగ్ మోడల్ సక్సెస్ కావడంతో చాలావరకు కంపెనీలు ఇదే పద్ధతి కొనసాగించాలని నిర్ణయించాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2. బ్రిటన్‌లో 61 కంపెనీలు ఈ ట్రయల్‌లో పాల్గొన్నాయి. 2022 జూన్ నుంచి డిసెంబర్ మధ్య తమ ఉద్యోగులతో వారానికి 34 గంటలు మాత్రమే పనిచేయించాయి. అంటే రోజుకు 8.5 గంటల చొప్పున 4 రోజుల్లో 34 గంటలు పనిచేశారు ఉద్యోగులు. మిగతా మూడు రోజులు వీకాఫ్ తీసుకున్నారు. ఆరు నెలల పాటు చేపట్టిన ట్రయల్ విజయవంతమైనట్టు కంపెనీలు ప్రకటించాయి. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఈ ట్రయల్‌లో 61 కంపెనీలు పాల్గొంటే అందులో 92 శాతం అంటే 56 కంపెనీలు ఇదే పద్ధతి కొనసాగించాలని నిర్ణయించాయి. వీటిలో 18 కంపెనీలు శాశ్వతంగా ఫోర్ డే వర్క్ వీక్ కొనసాగిస్తామని ప్రకటించాయి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ట్రయల్ అని బ్రిటీష్‌కు చెందిన రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఆటోనోమీ ప్రకటించింది. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఆటోనోమీ నిర్వహించిన ట్రయల్‌లో వేర్వేరు రంగాలు, సంస్థలకు చెందిన 2,900 ఉద్యోగులు పాల్గొన్నారు. స్టెల్లార్ అసెట్ మేనేజ్మెంట్, రైవెలిన్ రోబోటిక్స్ లాంటి సంస్థలు పాల్గొన్నాయి. ఉద్యోగులు తమ ప్రొడక్టివిటీని మెయింటైన్ చేసినట్టు ఆ కంపెనీలు ప్రకటించాయి. బ్రిటన్‌లోని ఇతర కంపెనీలు కూడా త్వరలో ఫోర్ డే వర్క్ వీక్‌పై నిర్ణయం తీసుకోవచ్చన్న వార్తలొస్తున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఫోర్ డే వర్క్ వీక్ విధానం ఫలితంగా ఉద్యోగులు తమ ఉద్యోగాలను వదులుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని తేలింది. వారి శ్రేయస్సు మరియు పని-జీవిత సమతుల్యత మెరుగుపడిందని ఉద్యోగులు తెలిపారు. ఫోర్ డే వర్క్ వీక్ ఉద్యమానికి ఇది ప్రధాన పురోగతి అని 4 డే వీక్ క్యాంపైన్ డైరెక్టర్ జో రైల్ తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)